TOP STORIESBreaking Newsతెలంగాణ

Pensions : పింఛన్ దారులకు శుభవార్త ఎప్పుడో.. ఆశగా ఎదురుచూపు..!

Pensions : పింఛన్ దారులకు శుభవార్త ఎప్పుడో.. ఆశగా ఎదురుచూపు..!

పాతవారికి పెరగని పింఛన్, కొత్తవారికి లేవు..

మన సాక్షి:

శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్ రూ. 4000, వికలాంగులకు రూ.6000, ఎప్పుడు ఇస్తారు అని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర నడుస్తున్న ఇంకా ఆసరా పింఛన్ పెంచలేదని వాపోతున్నారు.

గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం అర్హులు పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం లేకుండా 2018లో వైబ్ సైట్ నిలిపివేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో పింఛన్ల కోసం గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసిన పింఛన్లు మంజూరు కావడం లేదని మంజూరు చేయాలని వృద్ధులు, దివ్యాంగులు, చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు .

తెలంగాణలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నవారు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్ తో లబ్ధి పొందుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పింఛన్లను పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్ రూ.4000, వికలాంగులకు రూ.6000 ఎప్పుడు ఇస్తారు అని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ వర్గాలకు ఇస్తున్న పింఛన్ రూ.2016 నుండి రూ.4 వేలకు వికలాంగుల పింఛను, నాలుగు వేలు నుండి 6000 రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.. కానీ ఇప్పటివరకు ఎన్నికల హామీని అమలు చేయకపోవడంపై లబ్ధిదారులు నిరుత్సవ పడుతున్నారు. దీనికి తోడు అర్హులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా ప్రభుత్వం వైబ్సైట్ను నిలిపివేసింది.

ఆసరా పింఛన్ అర్హత వయసు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 65 సంవత్సరముల నుండి 57 సంవత్సరములకు తగ్గించింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో కూడా దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు అందించాలని పలువురు వృద్ధులు వికలాంగులు కోరుతున్నారు.

2018 సంవత్సరము నుండి కొత్త పింఛన్ కొరకు దరఖాస్తు చేసుకొనుటకు వెబ్సైటు బందు ఉండటం వలన కొన్ని వేల మంది వితంతువులు వికలాంగులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దయ గుణంతో ఆసరా పింఛన్లు దివాంగుల పెన్షన్ పెంచాలని కొత్తవారికి అవకాశం కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

By : చెరుకుపల్లి నాగేశ్వరరావు, పెన్ పహాడ్

MOST READ : 

  1. TG News : బీఆర్ఎస్ అంటే.. డాడీ, డాటర్, సన్ పార్టీ.. కవిత లేఖ ఓ డ్రామా.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

  2. Gold Price : తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. District collector : చేయూత పెన్షన్లపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..!

  4. District collector : ఇవీ కేంద్ర ప్రభుత్వ పథకాలు.. దరఖాస్తు ఇలా.. సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్..!

  5. WhatsApp Chats : మీరు ఇలా చాట్ చేస్తున్నారా.. అయితే మీ బంధం బలహీన పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి..!

  6. New Phone Numbers : విద్యుత్ అధికారుల నూతన ఫోన్ నెంబర్లు ఇవే.. సమస్యలు ఉంటే ఫోన్ చేయండి..!

మరిన్ని వార్తలు