TOP STORIESBreaking News

TG News : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. యువ వికాసం పథకానికి మీరు అర్హులేనా..!

TG News : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. యువ వికాసం పథకానికి మీరు అర్హులేనా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ సర్కార్ యువతకు శుభవార్త తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకానికి నిబంధనలు విడుదల చేసింది. ఉపాధి కోసం రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలవారు దరఖాస్తులు చేసుకోవాల్సిందే.

నిరుద్యోగ యువతకు 4 లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వరున్నారు. అందుకోసం గాను ప్రభుత్వం 6000 కోట్ల రూపాయలను రాజీవ్ యువ వికాస పథకానికి కేటాయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తుల చివరి తేదీగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.

చిరు వ్యాపారులకు 50 వేల వరకు మంజూరు చేసే రుణాలు 100% సబ్సిడీతో ఇవ్వనున్నారు. వారు తిరిగి ప్రభుత్వానికి కట్టాల్సిన పనిలేదు. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ కు కూడా 100% రాయితో ప్రభుత్వం రుణాలు ఇవ్వనన్నది. లక్ష రూపాయలు లోపు రుణాలు తీసుకున్న వారికి కేవలం 10 వేలు మాత్రమే చెల్లించాలి (90 వేల రూపాయలు రాయితీ) కల్పించనున్నది

రెండు లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకుంటే 80 శాతం రాయితీని కల్పిస్తారు. నాలుగు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న వారికి 70% రాయితీ ఉంటుంది.

వీరు అర్హులు :

రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షణాల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు ఉన్నవారు అర్హులు. నాన్ అగ్రికల్చర్ యూనిట్లకు 21 నుంచి 55 సంవత్సరాలలోపు గలవారు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 60 ఏళ్ల వరకు వయస్సున్న వారు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.

రాజీ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పడిన తర్వాత కుల ధ్రువీకరణ పత్రం, రవాణా రంగానికి సంబంధించిన వారైతే డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ రంగానికి సంబంధించిన వారైతే పట్టాదారు పాస్ పుస్తకాలు, వికలాంగులకు సదరం సర్టిఫికెట్, పాస్ పోటో సైజ్ ఫోటోలు ఉండాలి. రేషన్ కార్డు లేని వారు ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చును.

స్వయం ఉపాధి ద్వారా ఐదు సంవత్సరాలలో ఒక కుటుంబానికి ఒక పథకం మాత్రమే లభిస్తుంది. అర్హులైన వారు https://tgobmms.cgg.gov.in/ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీవో కార్యాలయంలో, మండల పరిషత్ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారాలను అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో డబ్బులు జమ..!

  2. Suryapet : సూర్యాపేట జిల్లా ఖమ్మం -కోదాడ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం.. !

  3. Heart Attack : మీరు రోజూ ఇలా చేయకుంటే.. హార్ట్ ఎటాకే..!

  4. Eye Health : ఈ లక్షణాలు కనిపిస్తే.. కళ్లజోడును తప్పనిసరిగా మార్చాల్సిందే.. కంటి ఆరోగ్యం కోసం..!

  5. Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు