Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి వెల్లడి, లేటెస్ట్ అప్డేట్..!
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి వెల్లడి, లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సర్వే కొనసాగుతుంది. ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి సంబంధిత అధికారులు వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉంటున్న నివాసం, ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, సొంత ఇల్లు ఉంటున్నారా..?, అద్దె ఇంట్లో ఉంటున్నారా..? అనే వివరాలతో పాటు సొంత స్థలం ఉంటే డాక్యుమెంట్లను, ఇంటిలో ఉంటే కరెంట్ బిల్లులను యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు.
లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయడానికి అర్హతల కోసం ఆన్లైన్ లో నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు 65 లక్షల మంది వివరాలను యాప్ లో నమోదు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలోని అర్హులందరికీ ఇల్లు నిర్మించాలనే లక్ష్యం తో ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యంత నిరుపేదలుగా ఉన్న వారిని గుర్తించి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. వారికి జనవరి 31వ తేదీలోగా మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ నెల గణతంత్ర దినోత్సవం, 26వ తేదీన రైతు భరోసా తో పాటు రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మూడు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా ఇందిరమ్మ ఇండ్లు ఈ నెలాఖరులోగా మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 65 లక్షల మంది వివరాలను యాప్ లో నమోదు చేశారు. ఏది ఏమైనా లబ్ధిదారులకు జనవరి 31వ తేదీలోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కానున్నాయి.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!
-
SBI : డిగ్రీ అర్హతతో SBIలో భారీగా ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ, వేతనం రూ.50వేలు..!
-
Rythu Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా.. పంట పొలాల్లో శాటిలైట్ సర్వే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తులు చేసుకోవాలా.. మీరు అర్హులేనా..!









