Rythu Bharosa : రైతు భరోసా పై అన్నదాతకు శుభవార్త.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!
Rythu Bharosa : రైతు భరోసా పై అన్నదాతకు శుభవార్త.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం పై అన్నదాతకు శుభవార్త అందనున్నది. రాష్ట్రంలో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి రైతు భరోసా పథకాన్ని అందజేశారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 జనవరి 26వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరానికి 10,000 రూపాయలను రెండు విడతలుగా అందజేయగా కాంగ్రెస్ సర్కార్ 12 వేల రూపాయలను అందజేస్తుంది.
మార్చి నెలాఖరు లోపు రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యింది. అంతే కాకుండా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్రంలో పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ రైతుభరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల రెండవ వారంలోగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతు భరోసా పథకం పై కీలక ఆదేశాలు చేయనున్నారు. అందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం బలోపేతం చేయడానికి గాను ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నది. ఈనెల రెండవ వారంలోగా రైతు భరోసా పథకంపై స్పష్టమైన ఆదేశాలు రానున్నాయి.
ఇది కూడా చదవండి :
———————————-
-
NEET : నీట్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNS అమలు.. జిల్లా ఎస్పీ..!
-
Miryalaguda : మిర్యాలగూడలో సౌండ్స్ ఆఫ్ మంగ్లీ లైవ్ ఇన్ కాన్సెప్ట్ మ్యూజికల్ నైట్..!
-
Mega Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా..!
-
Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)
-
Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!









