Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా
Aadhaar Cards : ఆధార్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సవరణలకు కేంద్రాల ఏర్పాటు..!

Aadhaar Cards : ఆధార్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సవరణలకు కేంద్రాల ఏర్పాటు..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి :
ఆధార్ కార్డు ఉన్న వారందరికీ అధికారులు గుడ్ న్యూస్ తెలియజేశారు. ఆధార్ కార్డుల అప్డేట్ తో పాటు తప్పులు ఉన్న వాటిని సవరణ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు మండలాల్లో ఆధార్ సవరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, పెద్దపల్లి, రామగుండం పట్టణాలలో మున్సిపల్ కార్యాలయాలలో ఆగస్టు 21 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేశామని అన్నారు.
ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని, అంగన్వాడీ కేంద్రం లబ్ధిదారులు ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకుని పోషణ్ ట్రాకర్ ఎఫ్.ఆర్.ఎస్ 100 శాతం నమోదు చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
MOST READ :
-
Urea : ఒక్క బస్తా యూరియా ఇవ్వండి సార్.. పిఎసిఎస్ సిబ్బంది కాళ్లు మొక్కుతన్న రైతులు.. (వీడియో)
-
Gold Price : బంగారం ధరలకు ఇక బ్రేక్.. ఈరోజు తగ్గిందెంత.. తులం ధర ఎంతంటే..!
-
Tasildar : ఫర్టిలైజర్ షాప్స్ యజమానులకు తాసిల్దార్ సీరియస్ వార్నింగ్.. యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..!
-
Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!
-
Alumni : 22 ఏళ్ల స్నేహబంధం.. ఆత్మీయ సమ్మేళనం..!









