TG News : పర్యాటకులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ లో లాంచీ సేవలు, టూర్ ప్యాకేజీలు..!
TG News : పర్యాటకులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ లో లాంచీ సేవలు, టూర్ ప్యాకేజీలు..!
నల్లగొండ, మనసాక్షి.
సోమశిల నుంచి శ్రీశైలానికి & నాగర్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ (క్రూయిజ్) సేవలు నవంబర్ 2 నుంచి ప్రారంభిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
శుక్రవారం నాగార్జునసాగర్ ఆయన మాట్లాడుతూ కృష్ణమ్మ ఒడిలో, నల్లమల పచ్చదనం అందాలను వీక్షిస్తూ కృష్ణా నదిలో సాగే జల విహారానికి తెలంగాణ పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.
ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్ కోసం టూరిజం వెబ్ సైట్ ను సందర్శించి, పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
సోమశిల నుంచి శ్రీశైలం వరకు & నాగర్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు సింగిల్ రైడ్‌తో పాటు రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలను నిర్ణయించారు. ఈ రెండు వేర్వేరు ప్యాకేజీలకు ఒకే రకమైన టికెట్ ధరలే వర్తిస్తాయన్నారు.
సింగిల్ జర్నీలో పెద్దలకు రూ.2000, చిన్నారులకు రూ.1,600, రౌండప్ (రానుపోను) జర్నీలో పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,400 గా ధరను నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో లాంచీ ప్రయాణంతోపాటు టీ, స్నాక్స్ అందించనున్నతలలు తెలిపారు.
LATEST UPDATE :
-
Miryalguda : వివాహితపై కాంగ్రెస్ నాయకుడి లైంగిక దాడి.. అవమానంతో మహిళ ఆత్మహత్యాయత్నం..!
-
దీపావళి వేడుకల్లో కాళ్లు మొక్కి కాల్పులు.. మేనమామ, మేనల్లుడు మృతి.. (వీడియో)
-
Gold Price : తెలుగు మహిళలకు శుభవార్త.. రూ.7700 రికార్డు స్థాయిలో తగ్గిన పసిడి ధర..!
-
TG News : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే దీపావళి శుభవార్త..!









