TOP STORIESBreaking Newsజాతీయం

Good News : రైతులకు గుడ్ న్యూస్.. 13న ఖాతాలలో ఆ డబ్బులు జమ..!

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ కు సంబంధించిన 22వ విడత నిధులు ఈ నెల 13వ తేదీన జమ కానున్నాయి.

Good News : రైతులకు గుడ్ న్యూస్.. 13న ఖాతాలలో ఆ డబ్బులు జమ..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ కు సంబంధించిన 22వ విడత నిధులు ఈ నెల 13వ తేదీన జమ కానున్నాయి. పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి మూడు విడతలుగా 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తున్న విషయం తెలిసిందే.

గత ఏడాది నవంబర్ 19వ తేదీన 21వ విడత పిఎం కిసాన్ నిధులు రైతులకు ఖాతాలలో 2000 రూపాయలు జమ అయ్యాయి. 22వ విడత మార్చి 13వ తేదీన 2000 రూపాయలు జమకానున్నాయి. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ఈ పథకం లబ్ధి చేకూతుండగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

MOST READ 

మరిన్ని వార్తలు