Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంహైదరాబాద్

Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!

Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!

హైదరాబాద్ ,మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు అనేక చర్యలు చేపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కాగా ఇప్పటికే రుణమాఫీ కోసం నిధులు విడుదల చేయగా మరోసారి కూడా నిధులు విడుదల చేసి రైతులకు శుభవార్త తెలియజేసింది. రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియలో భాగంగానే బుధవారం మరోసారి నిధులు విడుదల చేసింది.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు 11, 812 కోట్ల రూపాయల రుణమాఫీని చేసింది. అందులో భాగంగా బుధవారం 1000 కోట్ల రూపాయలను రుణమాఫీ కోసం విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన వెయ్యి కోట్ల రూపాయల నిధులు ఆయా బ్యాంకు ఖాతాలలో రైతుల పేర్ల జమ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో నాలుగు విడతలుగా రుణమాఫీ ప్రక్రియ నిర్వహించింది.

ALSO READ : Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !

కాగా రెండవ విడత రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం విధితమే. 29.61 లక్షల మంది రైతులకు 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆగస్టు 15వ తేదీన 5809 కోట్ల రూపాయలను విడుదల చేసి తొమ్మిది లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసింది. ఇప్పటివరకు 1.20 లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసింది.

కాగా రుణమాఫీ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 21.35 లక్షల రైతులు లబ్ధి పొందనున్నారు. రాబోయే రోజుల్లో లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతుల రుణాలు మాఫీ చేయనున్నది. ఈ నెలాఖరులోగా రుణమాఫీ ప్రక్రియ సంపూర్ణంగా చేయనున్నది. లక్ష రూపాయల రుణమాఫీ ఈ నెలాఖరులోగా సంపూర్ణం కాగా ప్రభుత్వ లక్ష్యం కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం..!

తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియ చేసి రైతులను రుణ విముక్తులను చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. రైతులకు రైతుబంధు పథకం తో పాటు రైతు బీమా పథకం అమలు చేస్తూ… 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం రుణమాఫీ కూడా నిర్వహించడం వల్ల రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

ALSO READ : సూర్యాపేట : పర్యావరణహిత పట్టణంగా తీర్చిదిద్దుకుందాం : మంత్రి జగదీష్‌రెడ్డి

మరిన్ని వార్తలు