Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : పర్యావరణహిత పట్టణంగా తీర్చిదిద్దుకుందాం : మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట : పర్యావరణహిత పట్టణంగా తీర్చిదిద్దుకుందాం : మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి

ఎప్పటిలాగే ఈ వినాయక చవితికి కూడా మట్టి విగ్రహాలను పెట్టుకుని పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామని సూర్యాపేట శాససభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేటను పర్యావరణ హితమైన పట్టణంగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు.

వినాయక నవరాత్రి పూజలను పురస్కరించుకుని సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీలకు ఇవాళ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గణనాధులకు ప్రత్యెక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..

ALSO READ : WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!

తడి, పొడి చెత్తలో సూర్యాపేటకు ఇప్పటికే జాతీయ స్థాయి గుర్తింపు దక్కిందని చెప్పారు. ప్లాస్టిక్‌ నివారణ విషయంలో కూడా సూర్యాపేట ముందుండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ప్లాస్టిక్‌తో ముప్పు పొంచి ఉన్నదని, ప్లాస్టిక్‌ నివారణ కోసం మనం చేయగలిగిన మేలు చేయాలని మంత్రి సూచించారు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కాలుష్యం అవుతుందని, ఆ నీటితో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని మంత్రి తెలిపారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల నీరు, భూమి, గాలి కలుషితమై క్యాన్సర్‌ వ్యాధులు వస్తాయని, అందుకే మట్టి విగ్రహాలు పెట్టుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ALSO READ : Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!

గత తొమ్మిది సంవత్సరాలుగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతున్నదని చెప్పారు. ఉత్సవ కమిటీలు విధిగా మట్టి విగ్రహాలను పూజించాలని మంత్రి కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీతోపాటు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లలో అందుబాటులో ఉన్న మట్టి విగ్రహాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా మూడు వేల సీడ్ విగ్రహాలను తయారు చేసి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

రేపటి నుంచి సీడ్ విగ్రహాలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ విగ్రహాలను ఇండ్లలో పూజించి భూమిలో నాటితే మొక్కలుగా పెరుగుతాయని, అలా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారవుతారని మంత్రి పేర్కొన్నారు.

ALSO READ :

  1. TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!
  2. Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!

 

మరిన్ని వార్తలు