TOP STORIESBreaking Newsసంక్షేమం

TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!

TG News : మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి రూ.12 వేలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మహిళలకు శుభవార్త తెలియజేసింది. వారి ఖాతాలలో నగదు బదిలీ చేయనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12,000 రూపాయలను ప్రభుత్వం అందజేయనున్నది. భూమిలేని రైతు కూలీలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు.

గ్రామసభ వేదికగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గ్రామ సభలో నిర్ణయించిన నిర్ణయం ప్రకారమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు.

అందులో భాగంగా ఒక్కొక్క మహిళ ఖాతాల్లో 12 వేల రూపాయలు జమ చేస్తామని తెలంగాణ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. మహిళా కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు మహిళా పక్షపాతి ప్రభుత్వం.. అందుకే మహిళల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తామని తెలిపారు.

ఇలాంటి పథకం తీసుకురావడం వల్ల పేద కుటుంబంకు ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. కూలీలకు ఆర్థికచేయుట అందించడం కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. శాంతియుత వాతావరణంలో గ్రామ సభలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె వివరించారు. పేద కూలీలకు లబ్ధి చేకూరేలా.. ఈ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు పనిచేయాలని ఆమె సూచించారు.

|MOST READ : 

  1. Ration Cards : లిస్టులో పేరు లేకుంటే మళ్ళీ దరఖాస్తుకు అవకాశం.. కొత్త రేషన్ కార్డుల పై లేటెస్ట్ అప్డేట్..!

  2. February : ఫిబ్రవరి నెల.. భూమ్మీద ఉన్నవారికి ఇదే ఆఖరు.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యమే..!

  3. Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్ష లేకుండా ఎంపిక..!

  4. Gold Price : వీకెండ్ లో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!

  5. Hyderabad : హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించారు.. ఎల్బీనగర్ టు ఖైరతాబాద్.. (వీడియో)

మరిన్ని వార్తలు