Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : గ్రానైట్ ఫ్యాక్టరీల ఇష్టారాజ్యం.. రోడ్డెక్కిన గ్రామస్తులు..!

Karimnagar : గ్రానైట్ ఫ్యాక్టరీల ఇష్టారాజ్యం.. రోడ్డెక్కిన గ్రామస్తులు..!

కరీంనగర్, మనసాక్షి :

గ్రానైట్ పరిశ్రమల నుంచి వెలువడే దుమ్ము, ధూళి, వ్యర్థలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామస్థులు ఆందోళన చేశారు. శనివారం గ్రామంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలకు వెళ్లే దారిలో రోడ్డుపై బైటయించి ధర్నా చేపట్టారు.

ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ గ్రానైట్ ఫ్యాక్టరీల్లో రాళ్లను కట్ చేస్తుండగా వెలువడే కెమికల్ ఫ్లైయ్ యాష్, డస్ట్ వంటి వ్యర్థలను గ్రామాల్లోని ఖాళీ స్థలాలల్లో, రోడ్ల పక్కన నిల్వచేస్తున్నారన్నారు. దింతో డస్ట్ గాలికి ఎగిరివచ్చి ప్రయాణికుల కళ్లల్లో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మండలంలోని ఒద్యారం, ఎలగందల్, ఖాజీపూర్ మరియు నాగులమల్యాల గ్రామాల్లో ట్యాంకర్లతో వెస్ట్ కెమికల్, డస్ట్ నింపుతున్నారని ఆరోపించారు. దింతో నీళ్లు, గాలి కలుషితం కావడమే కాకుండా పశువులు గట్టి కూడా తినడం లేదన్నారు. ఇక పంట పొలాల్లో డస్ట్ పారి పంటలు సరిగా పండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రానైట్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే విశావాయువులతో గ్రామస్తులు అనారోగ్యానికి గురైవుతున్నరన్నారు. ఈ సమస్య పై స్థానికులు పలుమార్లు మైనింగ్, విజిలెన్స్, కాలుష్య నియంత్రణపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గ్రానైట్ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్, ఇల్లందుల ఆనంద్, ఔడ గోని శ్రీనివాస్, వెంకటేశ్వరరావు తిరుపతి, పురుషోత్తం, శ్రీనివాస్, అశోక్ తిరుపతి, వెంకటేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

Ramasamudram : విద్యావేత్త సదుం రవీంద్రనాథ్ జన్మదిన వేడుకలు..!

 

Kissing : ముద్దు పెట్టుకుంటే ఇన్ని లాభాలా.. తెలుసుకోవల్సిందే..!

 

Paddy : వరి లో డ్రం సీడర్, వెదజల్లే పద్ధతులపై బెంచ్ మార్క్ శాస్త్రవేత్తల సర్వే..!

 

Suryapet : చికెన్ తిని ఆరుగురికి అస్వస్థత..!

 

TG News : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు సంచలన నిర్ణయం..!

 

మరిన్ని వార్తలు