Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Groups : గ్రూప్ – 1 లో ప్రతిభ.. డీఎస్పీగా ఉద్యోగం సాధించిన ఐశ్వర్య..!

Groups : గ్రూప్ – 1 లో ప్రతిభ.. డీఎస్పీగా ఉద్యోగం సాధించిన ఐశ్వర్య..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ – 1 ఫలితాలలో చంద్రాయన్ గుట్టకు చెందిన బి ఐశ్వర్య డిఎస్పీగా ఎంపికయ్యారు. ఆమె తండ్రి వెంకటేష్ ముదిరాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. తల్లి వందన గృహిణి. ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లలో ఐశ్వర్య చిన్నమ్మాయి.

2011లో పదవ తరగతి పాసై, 2013లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. 2013 – 17 లో వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అనంతరం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐదు సంవత్సరాలు కష్టపడి గ్రూప్ -1 లో ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.

ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ కష్టపడి బాగా చదివానని, తల్లిదండ్రులు బాగా సహకరించారని తెలియజేశారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా ఐశ్వర్య కు అభినందనలు తెలుపుతున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..!

  2. District collector : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కీలక ఆదేశం.. స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి..!

  3. TG News : తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ..!

  4. Nalgonda : ఐదుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి..!

మరిన్ని వార్తలు