Rythu Bharosa : రైతు భరోసా కు మార్గదర్శకాలు.. మీరు అర్హులేనా.. పంపిణీ ఎప్పటి నుంచంటే..!
Rythu Bharosa : రైతు భరోసా కు మార్గదర్శకాలు.. మీరు అర్హులేనా.. పంపిణీ ఎప్పటి నుంచంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్ లో రైతులకు పంటల పెట్టుబడి కోసం సహాయం చేయాల్సిన ప్రభుత్వం పంటల కోతలు అయిపోయినప్పటికీ కూడా సహాయం అందచేయలేదు. కాగా రైతులను విస్మరిస్తున్నారని రైతు భరోసా పథకం ప్రారంభించలేదని రైతుల నుంచి వ్యతిరేకత మొదలైంది.
అంతే కాకుండా ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్నాయి. దాంతో పాటు అధికారపక్షంలో కూడా రైతు భరోసా పథకం అమలు చేయకపోవడంతో కొందరు విస్మయానికి గురవుతున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా రైతు భరోసా పథకాన్ని ఎట్టకేలకు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15 వేల రూపాయల సహాయాన్ని అందజేయనున్నారు. వానాకాలం సీజన్ లో ఎకరానికి 7500 రూపాయల పంట పెట్టుబడి సహాయం త్వరలో అందజేయనున్నారు.
మార్గదర్శకాలు సిద్ధం :
గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయలను రెండు విడతలుగా పంట సహాయం చేసింది. కాగా రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం కోట్ల రూపాయల డబ్బులు దుబారా చేసింది. సాగుకు అనువైన భూములు కాకుండా గుట్టలు, రాళ్లు ఉన్న భూములతో పాటు సాగుకు యోగ్యం కానీ భూములకు కూడా రైతు బంధు పథకాన్ని వర్తింపజేసింది.
దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం ప్రారంభించడానికి ముందుగా రైతు వేదికలలో చర్చ కొనసాగించింది. దాంతో ఎక్కువ మంది రైతులు నుంచి సాగు చేసే పంట పొలాలకే రైతు భరోసా పథకం ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. రైతుల అభిప్రాయాలు దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసింది.
రాళ్లు, రప్పలు ఉన్న భూములకు కాకుండా సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసాను వర్తింప చేయనున్నారు. అదేవిధంగా ఏడున్నర ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసాను వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉద్యోగులకు ఇన్ కమ్ టాక్స్ చెల్లించే వారికి కూడా రైతు భరోసాను ఇవ్వద్దని నిర్ణయించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా పథకం ద్వారా ఈనెలాఖరు (నవంబర్) నుంచి డిసెంబర్ నెల వరకు పూర్తిస్థాయిలో పంట సహాయం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా పథకానికి సంబంధించిన మొదటి విడత ఎకరానికి 7500 రూపాయలను జమ చేయనున్నారు.
MOST READ :
-
TGSRTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారందరికీ చార్జీల తగ్గింపు..!
-
Batti Vikramarka : తెలంగాణలో త్వరలో గ్రీన్ ఎనర్జీ.. 2025 మే నాటికి పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పాదన..!
-
TG News : వేసవి రాకముందే.. మరో రెండు రోజుల్లో పాఠశాలలకు ఒంటిపూట బడులు.. ఇవే వేళలు..!
-
TG News : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్..!










