తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Guinness Book : సూర్య నమస్కారాలతో గిన్నిస్ బుక్ లో చోటు..!

Guinness Book : సూర్య నమస్కారాలతో గిన్నిస్ బుక్ లో చోటు..!

సూర్యాపేట, మనసాక్షి

ఇటీవల అరకులో నిర్వహించిన 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో చేసిన కార్యక్రమానికి గిన్నిస్ బుక్ లో చోటు లభించిందని ఇండియన్ యోగ అసోసియేషన్ కన్వీనర్, యోగాచార్యులు పతంజలి శ్రీనివాస్ తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల యోగా చైతన్య యాత్రలో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్ వెళుతూ మార్గమధ్యలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం లో జరుగుతున్న యోగ కార్యక్రమంలో వారు పాల్గొని సాధకులతో మాట్లాడారు.

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరి యోగా చేయాలని సాధకులకు తెలిపారు. గ్యాస్ ట్రబుల్, జీవనశైలి, త్రాగే నీరు, వివిధ రోగాలను సాధకుల వివరించారు. అరకులో జరిగిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో 21,850 గిరిజన విద్యార్థులు పాల్గొన్నారనీ, దీంతో ప్రపంచ రికార్డు సాధించడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ లో చోటు లభించడంతో సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ మండలి సాధకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాధకులు శ్రీపాద భాస్కరాచారి, వేల్పుల సుధాకర్ గోరంట్ల శ్రీనివాస్, పద్మ ,మధు ,మాధవి బాణాల శ్రీనివాస్, కె ఎస్ రావు మురళీకృష్ణ, జ్యోతి, లింగయ్య, శ్రీనాథ్, చంద్రశేఖర్, సైదులు, సరిత తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. PDS : అక్రమంగా తరలిస్తున్న 97 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత..!

  2. Seeds : నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ టీం..!

  3. Gold Price : మరోసారి షాక్ ఇచ్చిన గోల్డ్.. ధర ఎంతంటే..!

  4. Pensions : పింఛన్ దారులకు శుభవార్త ఎప్పుడో.. ఆశగా ఎదురుచూపు..!

  5. Metro : మెట్రో చార్జీల తగ్గింపు.. రేపటి నుంచి అమలు.. ఇవీ చార్జీలు..!

మరిన్ని వార్తలు