Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం
హరీష్‌రావును కలిసిన గుర్రంపోడు మండల బిఆర్ఎస్ నాయకులు..!
మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్‌రావును గుర్రంపోడు మండల బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

హరీష్‌రావును కలిసిన గుర్రంపోడు మండల బిఆర్ఎస్ నాయకులు..!
గుర్రంపోడు, మన సాక్షి:
మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్‌రావును గుర్రంపోడు మండల బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం జరిగిన ఈ భేటీలో గుర్రంపోడు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావుతో పాటు ఎన్ఆర్ఐ నాగులవంచ నరసింహ రావు, నాగులవంచ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తిరుపతిరావు హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.దీనిపై హరీష్‌రావు స్పందిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
MOST READ :
- Nalgonda : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ప్రకటన.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..!
- Nalgonda : నల్గొండ జిల్లాలో రూ.15 లక్షల బంగారం పోగొట్టుకున్న మహిళ.. గంటల్లో రికవరీ ఎలా అయిందంటే..!
- Hyderabad : హైదరాబాదులో దారుణం.. రెండు నెలల శిశువు కాళ్లు, చేతులు కట్టేసి పొయ్యిలో పడేసి హత్య చేసిన కన్నతల్లి..!
- Fake Company : నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు.. బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్..!









