Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ప్రకటన.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..!

హాలియా పట్టణంలో శ్రీ లక్ష్మినర్సింహా గార్డెన్స్ నందు నల్లగొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అండ్ అలైవ్ ( చేరండి ప్రాణాలతో చేరండి) కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి పాల్గొన్నారు.

Nalgonda : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ప్రకటన.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..!

హాలియా, మన సాక్షి:

హాలియా పట్టణంలో శ్రీ లక్ష్మినర్సింహా గార్డెన్స్ నందు నల్లగొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అండ్ అలైవ్ ( చేరండి ప్రాణాలతో చేరండి) కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్న శిబిరాన్ని సందర్శించి, కంటి పరీక్షలు చేయించుకున్న డ్రైవర్లకు ఉచితంగా అద్దలను అందజేశారు.

ఈ సందర్బంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు, పోలిసుల సూచనలు పాటించాలని తెలిపారు. హెల్మెంట్ వాడకం పై నల్లగొండ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఎన్నో అవగహన కార్యక్రమాలు నిర్వహించిన, మీషన్ పరివార్తన్ లొ భాగంగా నో హెల్మెంట్ నో పెట్రోల్ కార్యక్రమం ధ్వారా అవగహన కల్పించిన ఇంకా ప్రజలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదలకు గురి అయి ప్రాణాలు కోల్పోతున్నారు అని అన్నారు.

ALSO READ Nalgonda : నల్గొండ జిల్లాలో రూ.15 లక్షల బంగారం పోగొట్టుకున్న మహిళ.. గంటల్లో రికవరీ ఎలా అయిందంటే..!

ప్రతి ఒక్కరు హెల్మెంట్ ధరించి ప్రయాణం చేయాలనీ మీ కుటుంబానికి భద్రత హెల్మెంట్ అని అన్నారు.హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు గత సవంత్సరానికి ఇప్పటికి చాలా వరకు తగ్గినయని, సీఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ ఎప్పటికి అప్పుడు రోడ్డు ప్రమాదల నివారణకై ప్రజలకు అవగాహనా కల్పించడం ధ్వారా రోడ్డు ప్రమాదల కేసుల సంఖ్య తగ్గిందని సీఐ, ఎస్ఐ ని అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు భద్రత పరంగా కల్పించాలని సూచించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మాట్లాడుతూ అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ వారికి ధన్యవాదాలు తెలిపారు. గత 18 వ తేదీన బుధవారం హాలియా పట్టణం లొ సాగర్ ఏడమాకాలువ వంతెన పై లారీ డి కొని రోడ్డు ప్రమాదనికి గురి అయినా దంపతులకు తన ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులు అయినా కూతుర్ల కు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ఒక లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. వారికీ అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ALSO READ : Fake Company : నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు.. బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్..!

ఈ కార్యక్రమం డిఎస్పీ రాజశేఖర్ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రాజా రమేష్, నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజా ప్రసాద్, నిడమానూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, హాలియా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్, సీఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ పోలీస్ సిబ్బంది, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ : TG : తెలంగాణలో పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఎప్పటినుంచంటే..!

మరిన్ని వార్తలు