Social Media : సోషల్ మీడియా మాయలో మీ మెదడు పుచ్చిపోయిందా.. బ్రెయిన్ రాట్‌తో జాగ్రత్త..!
Social Media : సోషల్ మీడియా మాయలో మీ మెదడు పుచ్చిపోయిందా.. బ్రెయిన్ రాట్‌తో జాగ్రత్త..!
మనసాక్షి:
సోషల్ మీడియా మాయలో పడి మీ మెదడు పుచ్చిపోయిందా..? అవుననే చెబుతున్నాయి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు. అందుకే బ్రెయన్ రాట్…అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా ప్రకటించింది.
బ్రెయిన్ రాట్ :
ఇదే వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024. అవును బ్రెయిన్ రాట్ అనే పదాన్ని 2024 సంత్సరం వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రకటించింది. బ్రెయిన్ రాట్ అంటే…మనిషి మెదడు పుచ్చిపోవడం అనొచ్చు. సోషల్ మీడియాను ఎక్కువగా చూడటం…అవసరం లేని కంటెంట్‌ను బుర్రలో ఎక్కించుకుని… వాటి గురించే అతిగా ఆలోచించడం బ్రెయిన్ రాట్ అర్థమట. ఏది ఏమైనా 2024లో ఆంగ్ల పదాల్లో అతిగా వాడిన పదం ఇదేనట. అందుకే బ్రెయిన్ పదానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేశారు.
2024 వర్డ్ ఆప్ ది ఇయర్ టైటిల్ కోసం…డెమ్యూర్, డైనమిక్ ప్రైసింగ్, లోర్, రొమాంటసీ, స్లోప్ అనే పదాలు పోటీ పడ్డాయి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు బ్రెయిన్ రాట్ వర్డ్‌కే ఓటేయడంతో…ఈ పదం గెలిచింది. బ్రెయిన్ రాట్ అనే పదాన్ని ప్రముఖ ఆంగ్ల రచయిత హెన్నీ డేవిడ్ థోరో 1854లో…మొదటి సారి తాను రాసిన వాల్డెన్ అనే పుస్తకంలో వాడారు.
ఆక్స్‌ఫర్డ్ గుర్తింపు :
బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతి ఏడు వర్డ్ ఆఫ్ ఇయర్‌ను ప్రకటిస్తుంది. అందులో భాగంగా 2024 పదంగా బ్రెయన్ రాట్ పదాన్ని ప్రకటించింది. మొన్నటి వరకు అస్తమానం సోషల్ మీడియాను ఉపయోగించేవారిని బ్రెయన్ రాట్ బాధితులుగా పిలిచారు. ఇప్పుడు ఈ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గుర్తించడంతో…బ్రెయిన్ రాట్ పదానికి అధికారికంగా గుర్తింపు లభించినట్టైంది.
బ్రెయిన్ రాట్‌తో జాగ్రత్త..?
గత 20 ఏళ్ళుగా…అందునా ఈ పదేళ్ళ నుంచి సోషల్ మీడియా ప్రభావం…ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో పెరిగిపోయింది. సోషల్ మీడియా బారిన పడి చాలా సమయం వేస్ట్ చెయ్యడమే కాకుండా…తమ మెదడును కూడా మొద్దుబార్చుకుంటున్నారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతున్నారు. కొందరైతే…సోషల్ మీడియా మాయలోపడి బాత్రుమ్‌కు వెళ్ళినా సెల్‌ఫోన్‌ను తీసుకెళ్తున్నారు.
రోజులో ఎక్కువ సేపు సోషల్ మీడియాలో గడపడం వల్ల మెదడు దెబ్బతింటుందని తాజా పరిశోధనలు తేల్చాయి. రోజురోజుకూ ఆలోచనా శక్తి క్షీణించి చివరికి…నిత్యావసరమైన విషయాలకు కూడా స్పందించడం మానేస్తుంది. దీని వల్ల ఏ విషయంపై శ్రద్ధ చూపలేరు. చిన్న పని చేయాలన్నా బద్ధకిస్తారు.
అందుకే వీలైనంత సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. అవసరమైనంత వరకే సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. కానీ దాని భారినపడి మీరు కూడా బ్రెయన్ రాట్ బాధితులుగా మారకండి.
Reporting :
Mahipal Reddy, Hyderabad
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా వారికి మాత్రమే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..లేటెస్ట్ అప్డేట్..!
-
Beer : బీర్ ఆల్కహాల్ కాదా.. అక్కడ విచ్చల విడిగా బీర్ తాగుతారా..!
-
District Collector : నో సండే, నో హాలిడే.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Heater water : చలికాలం హీటర్ వాటర్‌తో స్నానం చేస్తున్నారా.. అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!
-
Nalgonda : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. దామరచర్లకు చెందిన బాలింత మృతి..!









