Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : మీ మొబైల్ ఫోన్ పోయిందా.. CEIR పోర్టల్ లో నమోదు చేస్తే చాలు దొరికినట్టే..!

Suryapet : మీ మొబైల్ ఫోన్ పోయిందా.. CEIR పోర్టల్ లో నమోదు చేస్తే చాలు దొరికినట్టే..!

సూర్యాపేట, మనసాక్షి :

సి.ఈ.ఐ.ఆర్ ద్వారా ఇప్పటివరకు 2340 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అందజేశామని జిల్లా ఎస్పీ కే నరసింహ చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 102 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి ఎస్పీ నరసింహ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ఈ సంవత్సరం 7వ దఫా మొబైల్ మేళా నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్ ను బాధితులకు అందించామన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 2340 మొబైల్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని, రూ.20 లక్షల విలువైన 102 మొబైల్స్ బాధితులకు అందించామని దీనికోసం జిల్లా పోలీసులు బాగా కృషి చేశారన్నారు.

వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సైబర్ వారియర్స్ నిరంతర శ్రమ ఫలితంగానే ఈ 102 మొబైల్ లు బాధితులు అందించ గలిగాము అన్నారు. వీటిని వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించాము అని తెలిపారు. మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అన్నారు.

మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందని, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సైబర్ మోసానికి గురై ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. పోయిన మొబైల్స్ ను గుర్తించడానికి సి ఈ ఐ ఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరిగినదిని ఎస్పీ వివరించారు.

ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు నమోదు చేసుకోవాలని, మొబైల్ ను బ్లాక్ చేసి, మీ సేవా ద్వారా ధరఖాస్తు సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రజలు, వినియోగదారులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
మొబైల్స్ పొందిన బాధితులు. పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, డీ సీ ఆర్ బి డిఎస్పీ రవి, స్పెషల్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ ఆర్ ఎస్ ఐ రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.

MOST READ : 

  1. Paddy : క్వింటా ధాన్యంకు రూ.2389.. అదనంగా రూ.500 బోనస్..!

  2. NREGS : తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ ప్రజావేదిక..!

  3. TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

  4. Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!

మరిన్ని వార్తలు