Hospitals Siege : అనుమతి లేకుండా వైద్యం.. ప్రైవేటు ఆసుపత్రులు సీజ్..!

Hospitals Siege : అనుమతి లేకుండా వైద్యం.. ప్రైవేటు ఆసుపత్రులు సీజ్..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహించడంపై జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో అనుమతి లేకుండా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను సీజ్ చేశారు.
ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడితే సహించం జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల అన్నారు. బుధవారం మండల కేంద్రమైన కంగ్టిలో పలు ఆస్పత్రులను స్థానిక వైద్యాధికారి డాక్టర్ నాగమణితో కలిసి తనిఖీ చేశారు. మండలంలో రెండు ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ నాగనిర్మల మాట్లాడుతూ.. మండలంలోని అనుమతి లేకుండా, హాస్పటల్ బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా ఔరాద్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. అదే విధంగా నిర్మల హాస్పిటల్లో బిఏఎంఎస్ వైద్యుడు అనుమతులు లేకుండా అలోపతి ప్రాక్టీస్ చేస్తున్నారని గుర్తించారు. అది నిబంధనకు విరుద్ధమని స్పష్టం చేశారు. నిర్మల పాలి క్లినిక్ కి అనుమతులు లేదు కానీ బిఏఎంఎస్ వైద్యుడు వైద్యం చేస్తున్నాడు.
అందుకోసం హాస్పిటల్ కు నోటీస్ ఇచ్చినట్లు చెప్పారు. మండలంలో ఆర్ఎంపీలపై క్రమం తప్పని తనిఖీలు నిర్వహించి, తప్పుదారులు నడపడం పట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
MOST READ :
-
Kavitha : టార్గెట్ హరీష్.. సంచలన ఆరోపణలు చేసిన కవిత..!
-
High Court : కాళేశ్వరం పై సిబిఐ విచారణకు బ్రేక్.. కెసిఆర్ కు భారీ ఊరట..!
-
Suryapet : పెన్ పహాడ్ ఎంపీఓ గా బాధ్యతలు స్వీకరించిన బీస్ రాజేశ్వర్.. ఎవరో తెలుసా..!
-
Green Banana : పచ్చి అరటికాయ తినొచ్చా.. ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం.. తెలుసుకుందాం..!
-
TG News : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!









