Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : కమ్మేసిన పొగమంచు.. దారి తెలియక వాహనదారుల అవస్థలు..!

నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్మేసింది. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు మంచు ముసుగులో చిక్కుకున్నాయి.

Nalgonda : కమ్మేసిన పొగమంచు.. దారి తెలియక వాహనదారుల అవస్థలు..!

గుర్రంపోడు, మన సాక్షి:

నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్మేసింది. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు మంచు ముసుగులో చిక్కుకున్నాయి. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న మంచు కారణంగా జనజీవనం నెమ్మదించింది.పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రహదారిపై కొన్ని మీటర్ల దూరం కూడా స్పష్టంగా కనిపించకపోవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ఎదురుగా వచ్చే వాహనాలు గుర్తుపట్టలేని పరిస్థితి ఉండటంతో, వాహనదారులు తమ వాహనాల హెడ్‌లైట్లు వేసుకుని అతి తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నారు.
పొగమంచుతో పాటు చలి తీవ్రత కూడా తోడవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

ఉదయాన్నే పనులకు వెళ్లే రైతులు, కూలీలు చలి తీవ్రతకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు కారణంగా రహదారులపై దృశ్యమానత తక్కువగా ఉన్నందున, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

MOST READ NEWS 

  1. Drunk and Drive : న్యూ ఇయర్ లో మందుబాబులకు షాక్.. ఎన్ని కేసులో తెలుసా..!

  2. Nalgonda : మిత్రమా మేమున్నాం.. అండగా స్నేహితులు..!

  3. Nalgonda : సొంత జిల్లాకే కలెక్టర్ గా వచ్చిన బడుగు చంద్రశేఖర్.. ఏ ఊరంటే..!

  4. Mutton Boti : మటన్ బోటి కర్రీ తినడం మంచిదేనా.. వీరు తినకూడదు..!

మరిన్ని వార్తలు