Heavy Rain : గుర్రంపోడులో భారీ వర్షం.. ఇళ్లల్లోకి చేరిన వరద నీరు, నీట మునిగిన పంటలు..!

Heavy Rain : గుర్రంపోడులో భారీ వర్షం.. ఇళ్లల్లోకి చేరిన వరద నీరు, నీట మునిగిన పంటలు..!
గుర్రంపోడు, మన సాక్షి:
గుర్రంపోడు మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వరద నీరు వచ్చి భారీగా చేరుకోవడంతో మండలంలోని చెరువులు, కుంటల అలుగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో డ్రైనేజీ లేక ఇళ్లల్లోకి వరద నీరు చేరుకున్నది. మోకాళ్ళ లోతు ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
తమకు నిద్ర కూడా కరువు అయింది అని రోధిస్తున్నారు. ఇళ్ల నుంచి రాలేని పరిస్థితి ఏర్పడ్డదని,ఎప్పుడు వర్షాలు వచ్చినా మాకు ఇదే పరిస్థితి అని , ఎన్నిసార్లు అధికారులకు, నాయకులకు చెప్పిన పట్టించుకోవడంలేదని, ఓట్ల కోసం వచ్చినప్పుడు చేస్తాము అని చెబుతారు, తర్వాత మమ్మల్ని పట్టించుకునేవారు లేరని, నాంపల్లి రోడ్డు కాలనీవాసులు చెబుతున్నారు.
అధికారుల, నాయకులపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. భారీ వర్షాలతో వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు సమృద్ధిగా కురివడం వల్ల ఏపుగా పెరిగిన వరి పంట మొత్తం నీట మునిగి,నేలపాలు అయింది. కొనుగోలు కేంద్రాలలో వడ్లు తడిసి ముద్దయ్యాయి.
నెల రోజుల క్రితం యూరియా కష్టాలు, ఇప్పుడు అకాల వర్షాలతో పంటలు తీవ్ర నష్టాలు, రైతుల కి దెబ్బ మీద దెబ్బ తగలడంతో రైతులు కన్నీళ్ళతో ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. మండలంలో ఇంతవరకు పంట నష్టలపై నివేదిక ఇవ్వకపోవడం వలన రైతులు తీవ్ర అగ్ర వ్యక్తం చేస్తున్నారు.
నష్టపోయిన రైతులకు సహాయం అందించడానికి, అధికారులు తక్షణమే నష్టపోయిన పొలాలను సందర్శించి, నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని,తక్షణ సహాయంతో పాటు, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం పంట బీమా, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు మరియు ప్రభుత్వ పథకాల అమలు వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
MOST READ :
-
District collector : అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రజలకు సూచన.. మొంథా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..!
-
Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!
-
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!
-
Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!









