KCR : హలో.. ఫామ్ హౌస్ కు రండి, డైలమాలో గులాబి దళపతి..!

పది సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినేతకు పార్టీని కాపాడుకోలేని పరిస్థితి నెలకొన్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్ళిపోతున్న విషయం తెలిసిందే. ఆ దారిలో ఇంకెంత మంది ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. 

KCR : హలో.. ఫామ్ హౌస్ కు రండి, డైలమాలో గులాబి దళపతి..!

హైదరాబాద్ , మన సాక్షి :

పది సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినేతకు పార్టీని కాపాడుకోలేని పరిస్థితి నెలకొన్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్ళిపోతున్న విషయం తెలిసిందే. ఆ దారిలో ఇంకెంత మంది ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది.

గులాబీ దళపతి కేసీఆర్ డైలమాలో ఉన్నారు. వారిని కాపాడుకునే ప్రయత్నంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇతర సీనియర్ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొడుతున్నారు. గురువారం అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

ఇది ఇలా ఉండగా హైదరాబాద్ నగర మేయర్ డిప్యూటీ మేయర్ లపై అవిశ్వాసం పెట్టేందుకుగాను శుక్రవారం బీఆర్ఎస్ నిర్వహించిన సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. ఈ చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే చర్చ కూడా సాగుతుంది.

పార్టీని కాపాడుకునేందుకు కేసిఆర్ చివరి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఫామ్ హౌస్ నుంచి నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి ఫామ్ హౌస్ రమ్మని పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క జిల్లా నాయకులకు ఒక్కొక్క తేదీలు ప్రకటించి ఆ తేదీలలో ఫామ్ హౌస్ కు వచ్చి సమావేశం కావాలని కేసిఆర్ కోరుతున్నట్లు తెలుస్తుంది. వచ్చిన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫామ్ హౌస్ లో కెసిఆర్ తీరికగా మాట్లాడి వారితో కలిసి భోజనం కూడా చేస్తున్నారు.

పదేళ్లు ఏం చేశారు..?

రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగారు. కేసీఆర్ సెక్రటేరియట్ కు రాకుండా ఫామ్ హౌస్ లో ఉండి ఎక్కువ కాలం పాలన సాగించారు. సచివాలయంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా సమయం కేటాయించని కెసిఆర్ ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి ఏకంగా రమ్మని ఫోన్ కాల్స్ చేస్తున్నారు.

ఫామ్ హౌస్ కు ఇప్పటివరకు వెళ్ళని నాయకులు ఎమ్మెల్యేలంతా ఫోన్ రాగానే ఎలా వెళ్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. పార్టీని కాపాడుకునేందుకు కేసిఆర్ నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతమంది కారు దిగిపోతారనేది లెక్కలు వేసుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది.

ALSO READ : 

Good News : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. ఈ చాన్స్ అస్సలు మిస్ కావద్దు..!

BREAKING : హోటల్లు బేకరీలపై మున్సిపల్ కమిషనర్ దాడులు.. బెంగళూరు అయ్యాంగార్ బేకరీ కి జరిమానా..!

WhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!