TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

అయ్యా జిల్లా కలెక్టర్ గారూ.. చదువుకోలేము, పాఠశాల బంద్ చేసి వెళ్లిపోయిన విద్యార్థులు..!

అయ్యా జిల్లా కలెక్టర్ గారూ.. చదువుకోలేము, పాఠశాల బంద్ చేసి వెళ్లిపోయిన విద్యార్థులు..!

దేవరకొండ, మనసాక్షి :

దేవరకొండ ఆదర్శ పాఠశాల పక్కన ఉన్న కోళ్ల ఫారం దుర్వాసనతో విద్యార్థులకు సమస్య నెలకొన్నది. గురువారం నాడు విద్యార్థులే విద్యాధికారులకు వినతి పత్రం రాసి విద్యార్థులు పాఠశాల ను స్వచ్ఛదంగా బందు చేసి పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళ్లి పోయారు.

ఆదర్శ పాఠశాలలో సుమారుగా 540 మంది విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలలో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో స్థలం యొక్క యజమానులు కోళ్ల ఫారం ఏర్పాటు చేసి ఉంచడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు దుర్వావాసనతోటి విద్యార్థిని విద్యార్థులు అనారోగ్యం పాలై వాంతులు విరోచనాల గురవుతున్నారని తక్షణమే కోళ్ల ఫామ్ను తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ వెంటనే విద్యార్థుల సమస్య స్పందించి పరిష్కారం చేయాలనీ విద్యార్థులు కోరారు. పక్కన ఉన్న ఆదర్శ బాలికల హాస్టల్ విద్యార్థులు హాస్టల్ లో అన్నం తినాలేక, హాస్టల్లో ఉండా లేక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు ఈ సందర్బంగా మాట్లాడుతూ మా సమస్యను పరిష్కారం చేస్తేనే మేము పాఠశాలకు వస్తాం అన్నారు.

జిల్లా కలెక్టర్ విద్యాధికారులు విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని విద్యార్థులు తెలియజేయడం జరిగింది.ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సువర్ణ వివరణ..పాఠశాలలో సమస్య ఉందని పై అధికారులకు తెలియజేయడం. ఆర్డిఓ ఎంఆర్ఓ ఎంఈఓ స్థానిక ఎమ్మెల్యే కూడా సమస్య గురించి తెలియజేయడం జరిగింది.

LATEST UPDATE : 

Harish Rao : కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ వ్యవహారంపై హరీష్ రావు కీలక ట్వీట్..!

మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!

Lion : సీసీ పూటేజీలో సింహం కనిపించింది.. భయాందోళనలో ప్రజలు.. (వీడియో)

మహిళలకు శుభవార్త.. వ్యాపార రంగంలో ప్రోత్సాహం, జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మరిన్ని వార్తలు