District collector : భోజనం ఎలా ఉంది.. స్నాక్స్ లో ఎం ఇస్తారు.. విద్యార్థులతో జిల్లా కలెక్టర్..!
District collector : భోజనం ఎలా ఉంది.. స్నాక్స్ లో ఎం ఇస్తారు.. విద్యార్థులతో జిల్లా కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా.. అన్ని సౌకర్యాలు కల్పించి సొంత ఇంటిని తలపించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట లోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ వంటగది, సరుకుల గదిని, విద్యార్థులు నిద్రించే గదులను తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన కామన్ డైట్ మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు ప్రతీ విద్యార్థి పాటించాలని అన్నారు. భోజనం చేస్తున్న ఉన్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి విద్యార్థులను భోజనం ఎలా ఉంది స్నాక్స్ లో ఎం ఇస్తారు.
తదితర ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి జిల్లా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ అధికారి రషీద్, ప్రిన్సిపాల్ ఖాజా మెహబూబ్ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!
-
SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!
-
Union Minister Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఘోరంగా ఓటమి ఖాయం..!
-
Sand : అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా.. వరుసగా లారీల పట్టివేత..!










