TOP STORIESBreaking Newsతెలంగాణ

TG News : ట్రాఫిక్ చలాన్ లపై భారీ డిస్కౌంట్.. 100% వరకు ఛాన్స్..!

TG News : ట్రాఫిక్ చలాన్ లపై భారీ డిస్కౌంట్.. 100% వరకు ఛాన్స్..!

మన సాక్షి :

మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయా..? ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నాయా..? కట్టలేకపోతున్నారా..? అయితే అలాంటి వారి కోసం డిసెంబర్ రెండో వారంలో 13వ తేదీన జరగబోయే లోక్ అదాలత్ ద్వారా మంచి ఛాన్స్ రాబోతుంది. 50 శాతం నుండి 100 శాతం వరకు కూడా డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి.

పాత చలాన్ లను క్లియర్ చేసుకునే ఈ అవకాశం అద్భుతంగా లభించనున్నది. ఈ అవకాశంలో మీపై ఉన్న కేసు పూర్తిగా క్లోజ్ అవుతుంది. భవిష్యత్తులో కూడా మళ్లీ ఆ చలాన్లకు సంబంధించి కోర్టు విచారణ ఉండదు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ పర్యవేక్షణలో ఈ లోకాదాలత్ నిర్వహిస్తారు.

చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పరిష్కరించనున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా భాగమవుతుంది. అయితే చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలు ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించబడతాయి.

కానీ ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరాలను ఈ రాయితీలో అవకాశం కల్పించలేదు. మద్యం సేవించి వాహనం నడపడం, హిట్ అండ్ రన్ కేసులు, ప్రమాదకరమైన డ్రైవింగ్, గాయాలు, మరణాలకు దారితీసిన రోడ్డు ప్రమాదాలలో ఈ చలాన్ లో సెటిల్మెంట్ చేసుకునే అవకాశం లేదు.

చలాన్లు ఎలా చెల్లించాలి అంటే ముందుగా మీ వాహనంపై పెండింగ్ లో చలాన్లు ఉన్నాయో..? లేదో? ఆన్‌లైన్ లో తనిఖీ చేసుకోవాలి. దాని ప్రకారం వెబ్ సైట్ ను సంప్రదించి పెండింగ్ లో ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

లో క్ అదాలత్ కు వెళ్లే ముందు వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, పాత చలాన్ కాపీలు ఉంటే తీసుకెళ్లాలి. లోక్ అదాలత్ నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో 50% నుంచి 100% వరకు కూడా డిస్కౌంట్ లభించే అవకాశాలు.

MOST READ 

  1. Gold Price : దిగి వచ్చిన గోల్డ్ ధర.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా..!

  2. Narayanpet : జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!

  3. PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!

  4. Nalgonda : రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ.. డైరెక్టర్ ఇంటిముందు బాధితుల ఆందోళన..!

  5. Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు