Job Mela : నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశం.. మెగా జాబ్ మేళా.. అర్హత ఏదైనా ఉద్యోగం..!

Job Mela : నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశం.. మెగా జాబ్ మేళా.. అర్హత ఏదైనా ఉద్యోగం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు. భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మే 3న జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో ఉన్న ఎస్.ఆర్.గార్డెన్స్ లో ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఇట్టి మెగా జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికను సోమవారం పట్టణంలో భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు, ఉపాధి లేక అనేక మంది యువతీ యువకులు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తెలుసుకుని వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ జాబ్ మేళాలో సుమారు 25 ప్రముఖ ఎం.ఎన్.సీ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ( బి ఎ, బి ఎస్ సి, బి కం) డిప్లమా, బిటెక్, ఐటిఐ విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు మీ యొక్క బయోడేటా తో పాటు విద్యార్హత కలిగిన జిరాక్స్ సర్టిఫికెట్లు, ఒక ఫోటో తీసుకువచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులు ఇట్టి మెగా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గోపాల్ గౌడ్, రుద్రారెడ్డి, హనుమంతు, వై.సంతోష్, శివరాజ్, ఎం.సంతోష్, నరేష్ గౌడ్, ప్రవీణ్, విజయ్, రాజు తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Gold Price : పసిడి పరుగు.. ఈరోజు తులం ఎంతో తెలుసా..!
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!
-
TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : ఇంటింటికి ఇంటర్నెట్.. 28 వేల పోస్టులకు నోటిఫికేషన్..!









