Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Hyderabad : టాటానగర్‌లో ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!

Hyderabad : టాటానగర్‌లో ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!
అత్తాపూర్, మనసాక్షి :
మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు, కమ్ముకొన్న దట్టమైన పొగతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాజేంద్రనగర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చంద్ర నాయక్ మాట్లాడుతూ…
మైలార్ దేవ్ పల్లి పరిధిలోని టాటా నగర్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్టు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగిందని .ఇది పాత ప్లాస్టిక్ సామాన్ల గోదామని తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
MOST READ :
-
Narayanpet : నిమజ్జనం లో అపశృతి.. డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల పరిశీలన..!
-
Miryalaguda : గణేష్ నిమజ్జనంలో అపశృతి.. సాగర్ ఎడమ కాలువలో తండ్రి, కొడుకులు గల్లంతు..!
-
Paneer: పనీర్ తింటే మంచిదేనా.. సామర్థ్యం తెలుసుకోండి..!
-
Hyderabad : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు రూ.2.31 కోట్లకు వేలం పాట.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..!









