Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. కొనుగోలుకు ఇదే మంచి ఛాయిస్..!
Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. కొనుగోలుకు ఇదే మంచి ఛాయిస్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర భారీగా తగ్గింది. పసిడి కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశం. కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర శుక్రవారం భారీగా తగ్గింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు శుక్రవారం ఒకరోజే 12,500 తగ్గింది.
దాంతో పసిడి ప్రియుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. మరింత తగ్గితే కొనుగోలు చేస్తామని పేర్కొంటున్నారు. తులం బంగారం లక్ష రూపాయలు పైగా అయిన విషయం తెలిసింది. కాగా మళ్లీ తగ్గుతూ వచ్చింది.
హైదరాబాదులో 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు శుక్రవారం 12,500 తగ్గి 9,83,500 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 11,500 తగ్గి 9,01,500 రూపాయలుగా ఉంది.
ఈరోజు తులం ఎంతంటే..?
తులం బంగారం హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఎంత ఉందంటే.? 24 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం 98,350 ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం 90,150 రూపాయలు ఉంది.









