Rythu Runamafi : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రుణమాఫీ పై పొన్నం కీలక ప్రకటన..!
Rythu Runamafi : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రుణమాఫీ పై పొన్నం కీలక ప్రకటన..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణలో రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ శుభవార్త తెలియజేశారు. రుణమాఫీ పై ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభలో పాల్గొని కీలక ప్రకటన చేశారు. ఆయన హుస్నాబాద్ పట్టణంలోని 15వ వార్డులో ప్రజా పాలన సభను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ కానీ రైతులకు, రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్న రైతులకు మార్చి నెలలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మార్చి నెలలో షెడ్యూల్ ఏర్పాటు చేసి షెడ్యూల్ ప్రకారం రుణమాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, నిరంతరం కొనసాగే విధంగా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. న్యాయంగా, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు. గ్రామ సభల్లో ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
MOST READ :
-
Additional collector : అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి.. అదనపు కలెక్టర్..!
-
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : పరీక్ష వ్రాసే విధానాన్ని విద్యార్థులకు తెలపాలి.. కలెక్టర్ ఆదేశం..!
-
Chevelle : సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయి.. ఎమ్మెల్యే యాదయ్య..!
-
SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!









