District collector : జిల్లా కలెక్టర్ రైతులకు భారీ శుభవార్త.. అందుబాటులోకి ధాన్యం తడిసినా.. ఆరబెట్టే యంత్రం..!
District collector : జిల్లా కలెక్టర్ రైతులకు భారీ శుభవార్త.. అందుబాటులోకి ధాన్యం తడిసినా.. ఆరబెట్టే యంత్రం..!
నల్లగొండ, మన సాక్షి :
వ్యవసాయ సీజన్లో ధాన్యం పండించిన రైతులకు ఎదురయ్యే ప్రధాన సమస్య దాన్యం లో తేమ శాతం ఎక్కువగా ఉండడం, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేందుకు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినట్లయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
అవగాహన లోపం , ధాన్యం వెంటనే మార్కెట్ కు తరలించాలనే ఆత్రుత తో రైతులు పంట కొత తర్వాత ధాన్యాన్ని నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కు తరలించడం వల్ల తేమశాతం ఎక్కువగా ఉండడం వల్ల ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే.
దీనివల్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి ఉంచి ఆరబెట్టాల్సి రావడం, ఈ సమయంలో వర్షం కురిస్తే తిరిగి ధాన్యం తడవడం ,ఇటు రైతులు, అటు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కొంటున్న విషయాన్ని మనం చూస్తున్న విషయమే.
ఈ సమస్యలన్నింటిని అధిగమించేందుకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన దాన్యం ఆరబెట్టే కొత్త యంత్రాలను కొనుగోలు చేస్తున్నది.
ఇందులో భాగంగా నల్గొండ జిల్లా యంత్రాంగం 2 మొబైల్ గ్రైన్ డ్రయర్లను ఒక్కోటి 14 లక్షల 40 వేల రూపాయల వ్యయంతో కొనుగోలు చేయడం జరిగింది. తాత్కాలికంగా వీటిని ఒకటి తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మరొకటి మిర్యాలగూడ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తిప్పర్తి మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన సంచార గ్రైన్ డ్రయర్ యంత్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు.
ఈ సందర్భంగా ధాన్యం తేమను ఆరబెట్టే యంత్రం పనితీరు, ప్రయోజనాలు ,ఇబ్బందులు అన్ని విషయాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వెంటనే యంత్రం సరఫరా చేసిన ప్రతినిధులను పిలిపించి యంత్రం పని తీరును పరిశీలించి వచ్చే సీజన్ లో రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఈ ధాన్యం తేమ ఆరబెట్టే యంత్రం తేమ శాతం ఎక్కువగా ఉన్న సమయంలో 17 శాతానికితగ్గించే అవకాశం ఉంది. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ,జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్ , మార్కెటింగ్ సెక్రెటరీ శ్రీధర రాజు,తిప్పర్తి తహసిల్దార్, ఎంపీడీవో, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి :
-
National Highway : జాతీయ రహదారిపైనే భారీ పార్కింగ్.. ఎవరికి పట్టదా..!
-
Annadata Sukhibhava : రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
District Collector : జిల్లా కలెక్టర్ ఆకాంక్ష.. మహిళలు కోటీశ్వరులు గా మారాలి..!
-
Fact Check : ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..!
-
Miryalaguda : పేద విద్యార్థికి ట్రిపుల్ ఐటీలో సీటు.. దాతలు సహకరిస్తేనే జాయినింగ్..!











