TOP STORIESBreaking Newsవ్యవసాయంసంక్షేమం

TG News : తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. 50శాతం సబ్సిడీ..!

TG News : తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. 50శాతం సబ్సిడీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో:

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది ఆ ప్రభుత్వం. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను రాయితీపై అందించేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా మహిళలకు 50% రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేయనున్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ యంత్ర పరికరాల పథకం కోసం 2.65 లక్షల మందికి పైగా రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. కాగా ఈ దరఖాస్తుల్లో సుమారుగా 90000 మంది మహిళలు ఉన్నారు. దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులందరికి యంత్ర పరికరాలలో రాయితీపై పంపిణీ చేయడానికి 300 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంది.

ఈ పథకం కోసం అర్హులైన రైతులందరికీ 50% రాయితీతో పరికరాలను అందజేయనున్నారు. వాటిలో 50 శాతం పరికరాలను మహిళా రైతులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా రైతులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంలో వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపేతం కానున్నట్లు తెలుస్తోంది.

MOST READ: 

  1. Gold Price : పసిడి ప్రియులకు ఊహించని షాక్.. ఒక్కరోజే రూ. 27,300..!

  2. Rythu : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఈరోజు సాయంత్రం లోగా ఖాతాలలో నగదు జమ..!

  3. Weight Loss: బరువు తగ్గాలనే వారికి బెస్ట్ ఫుడ్..!

  4. Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!

  5. Viral Video : ఏకలవ్య పాఠశాలలో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళా టీచర్లు.. (వైరల్ వీడియో)

మరిన్ని వార్తలు