తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు..! 

Nalgonda : శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు..! 

కనగల్, మన సాక్షి :

భక్తుల కొంగు బంగారంగా వీరాజిల్లుతున్న ధర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ హుండీని ఎండోమెంట్ అధికారులు బుధవారం లెక్కించారు.

మొత్తం 87 రోజులకు గాను రూ. 13,82,630 ఆదాయం సమకూరినట్లు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ బి. సుమతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జల్లేపల్లి జయరామయ్య, ధర్వేశిపురం మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి,

ఆలయ మాజీ చైర్మన్ ముత్తయ్య, మాజీ ఉత్సవ కమిటీ చైర్మన్ నగేష్ గౌడ్, శ్రీను, భిక్షం, రాజేష్, ఆలయ సీనియర్ అసిస్టెంట్లు జె. చంద్రయ్య, జి. నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్లు కే. ఉపేందర్ రెడ్డి, టి. రాజయ్య, ఎన్. ఆంజనేయులు, సిబ్బంది జె. రాజు సిహెచ్. శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు