Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ పట్టణానికి రూ.400 కోట్ల నిధులు తీసుకొచ్చాను.. ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఇప్పటివరకు 400 కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

Miryalaguda : మిర్యాలగూడ పట్టణానికి రూ.400 కోట్ల నిధులు తీసుకొచ్చాను.. ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఇప్పటివరకు 400 కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ నుంచి తీసుకొచ్చిన నిధులను వివిధ పథకాలకు ఖర్చు చేసినట్లు తెలిపారు.

ఆ నిధులతో గతంలో ఫెయిల్యూర్ అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, నూతన మంచినీటి పైపులైన్, మంచినీటి ట్యాంకుల నిర్మాణం, పార్కుల సుందరీకరణ, ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ లో, ప్రభుత్వ జూనియర్ కళాశాల లో వాకింగ్ ట్రాక్ నిర్మాణం, టాకా రోడ్డు విస్తరణ, సిసి రోడ్ల నిర్మాణం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పనులు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

బుధవారం మిర్యాలగూడ పట్టణంలో యుఐడిఎఫ్ ద్వారా 17 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని గాంధీ నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ స్థలాలకు దరఖాస్తు పత్రాలను విడుదల చేశారు.

పట్టణంలో సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాల వారికి,
సొంత ఇంటి కలలు నెరవేర్చేందుకు ప్రత్యేకంగా, సొంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు, స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం ఇచ్చేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి విజ్ఞప్తి చేయడంతో మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

జనవరి 16వ తేదీ వరకు సబ్ కలెక్టర్, తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కొమ్ము శ్రీనివాస్, బంటు లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ NEWS 

  1. సంక్రాంతి పండుగ వేళ తీవ్ర విషాదం.. డీసీఎం ఢీకొన్న బస్సు..!

  2. BREAKING : లిఫ్ట్ కాలువలో ట్రాక్టర్ బోల్తా..!

  3. TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!

  4. TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!

మరిన్ని వార్తలు