Miryalaguda : నేను, నా మిర్యాలగూడ బిఎల్ఆర్ స్వచ్ఛంద కార్యక్రమం ప్రారంభం.. భారీగా తరలివచ్చిన ప్రముఖులు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) చేపట్టిన నేను, నా మిర్యాలగూడ అనే స్వచ్ఛంద కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కాగా కార్యక్రమానికి స్వచ్ఛందంగా పట్టణంలోని పలువురు ప్రముఖులు భారీగా తరలివచ్చారు.

Miryalaguda : నేను, నా మిర్యాలగూడ బిఎల్ఆర్ స్వచ్ఛంద కార్యక్రమం ప్రారంభం.. భారీగా తరలివచ్చిన ప్రముఖులు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) చేపట్టిన నేను, నా మిర్యాలగూడ అనే స్వచ్ఛంద కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కాగా కార్యక్రమానికి స్వచ్ఛందంగా పట్టణంలోని పలువురు ప్రముఖులు భారీగా తరలివచ్చారు. పట్టణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నేను, నా మిర్యాలగూడ అని ప్రతిఒక్క మిర్యాలగూడ వాసి గర్వంగా చెప్పుకునే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని తీర్చి దిద్దాలి అనే లక్ష్యంతో మొదట పట్టణ పారిశుధ్య కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమం ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం వర్షాకాలంలో డ్రైనేజ్ ల మూలాన దోమలు అధికమై ప్రజలు విష రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని, వాటిని నియంత్రించాలనే ఉద్దేశంతో మొదట ఈ పట్టణ పారిశుధ్య స్వచ్ఛంద కార్యక్రమం ఎంచుకోవడం జరిగిందన్నారు. ఇదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నేను, నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా పలు స్వచ్చంధ కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు మన మిర్యాలగూడ వైపు చూసే విధంగా చేయాలనేది మా యొక్క ప్రథమ లక్ష్యమన్నారు.

దానికి అధికారుల, ప్రజల సహకారం కూడా చాలా అవసరమని, మనం అందరం కలసి కట్టుగా, బాధ్యతగా పనిచేస్తూ ఉంటే మన నియోజకవర్గం పారిశుద్ధ్యంలో, విద్యలో, వైద్యంలో, సామాజిక న్యాయంలో ముందు ఉండే అవకాశం ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా వచ్చిన లయన్స్ క్లబ్ వారికి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్ మెంట్ వారికి, పారిశుధ్య కార్మికులకు , రెవెన్యూ డిపార్ట్ మెంట్ వారికి, జనయేత్రీ ఫౌండేషన్ వారికి, ఫోటో గ్రాఫర్స్ యునియన్ వారికి , కాంగ్రెస్ నాయకులకు బి ఎల్ ఆర్ బ్రదర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఈరోజు కార్యక్రమంలో భాగంగా 12 వార్డులలో ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుందని అన్నారు. ప్రతిఒక్కరూ వారి వారి వార్డులలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాటలు చెప్పడమే కాకుండా.. తాను ఆచరిస్తానంటూ పారిశుద్ద్య కార్మికుడి అవతారమెత్తిన ఎమ్మెల్యే, పలు వార్డ్ లలో పారిశుధ్య కార్మికులతో డ్రైనేజ్ లు శుభ్రం చేశారు. ప్రజలిచ్చిన ఐదేళ్ల అవకాశాన్ని రాజకీయ నాయకుడిగా కాకుండా.. ప్రజా సేవకుడిగా మిర్యాలగూడ అభివృద్ధి కోసం పని చేస్తా అని అన్నారు.

కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాసరావు, డిఎస్పి రాజశేఖర్ రాజు, తాసిల్దార్ హరిబాబు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి , కిసాన్ విభాగం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కౌన్సిలర్ లు వంగాల నిరంజన్ రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, రామకృష్ణ, రవినాయక్, 24 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మొల్లాల అమృత రెడ్డి, శాగ జలంధర్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, డిప్యూటీ డిఎంహెచ్ వో రవి, మండల విద్యాధికారి బాలాజీ నాయక్, జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షులు మునీర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

BREAKING : ఉపాధ్యాయురాలుగా మారిన జిల్లా కలెక్టర్.. ఎందుకు అలా, తెలుసుకోవాలని ఉందా..! 

NALGONDA : నల్గొండ జిల్లాలో దారుణం.. ఆకతాయిల వేధింపులకు యువతి బలవన్మరణం..!