Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

BREAKING : ఉపాధ్యాయురాలుగా మారిన జిల్లా కలెక్టర్.. ఎందుకు అలా, తెలుసుకోవాలని ఉందా..! 

BREAKING : ఉపాధ్యాయురాలుగా మారిన జిల్లా కలెక్టర్.. ఎందుకు అలా, తెలుసుకోవాలని ఉందా..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట మండలం జాజాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. అలాగే విద్యార్థుల హాజరు, బోధన, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై తనిఖీ చేశారు.

9వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థులకు బోర్డు పై రాసి విద్యా బోధన చేశారు. అనంతరం విద్యార్థులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని అడిగారు. గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలు ఎంత శాతం వచ్చాయని అడగగా 84% ఉత్తీర్ణులయ్యారని హెడ్మాస్టర్ కలెక్టర్ కు తెలిపారు.

ఈసారి జరిగే ఎస్ఎస్సి పరీక్షల్లో కష్టపడి పనిచేసి 100% మార్కులు వచ్చేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలన్నారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లి పదవ తరగతి విద్యార్థులకు అవసరమైతే అదనపు క్లాసులు నిర్వహించి బోధించాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి విద్యార్థులతో మమేకం అయ్యారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ప్రశ్నలు అడిగారు.

అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అంగన్వాడీ టీచర్ల ద్వారా శిక్షణ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను గుడ్లు తిన్నారా అని అడిగారు దానికి విద్యార్థులు ప్రతిరోజు ఇస్తున్నారని తెలిపారు. అనంతరం వంటగదిని పరిశీలించి పరిసరాలు గార్డెనింగ్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

శ్యామ్ అండ్ మామ్ విద్యార్థులను ప్రత్యేక దృష్టి సారించి బరువు తక్కువ ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలెక్టర్ స్వయంగా సాల్టర్ స్కేల్ ద్వారా పిల్లల బరువు, మరియు ఎత్తు పరిశీలించరు.పంచాయతీ సెక్రటరీ ని ప్లాంటేషన్ టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో అబ్దుల్ ఘని,యస్. ఓ.శ్రీనివాస్, హెడ్మాస్టర్, స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

KTR : మీకు అన్నగా ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్వీట్..!

Power Bill : కరెంటు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. విద్యుత్ బిల్లులపై కీలక అప్ డేట్.!

Miryalaguda : విశాఖ ఎక్స్ ప్రెస్ లో దారుణం.. యువతిపై లైంగిక దాడికి యత్నం, రైలు లోంచి తోసేసిన యువకుడు..!

మరిన్ని వార్తలు