Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంహైదరాబాద్

Kcr : నేను కొడితే మామూలుగా ఉండదు.. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..!

Kcr : నేను కొడితే మామూలుగా ఉండదు.. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..!

మన సాక్షి, హైదరాబాద్ :

నేను గంభీరంగా.. మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్న.. కొడితే మామూలుగా కాదు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు అంటూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ సర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాగా నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగా అమలు కావడం లేదు, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సంగమేశ్వరం, బసవేశ్వరం, కాలేశ్వరం ఎండబెడుతున్నారని, తెలంగాణలో భూముల ధరలు అమాంతం పడిపోతున్నాయని అన్నారు.

ఆలోచన లేకుండా ఎవడో ఏదో చెప్తే.. నమ్మి ఓట్లేస్తే తెలంగాణ కు మంచి గుణపాఠం లభించిందని కేసీఆర్ పేర్కొన్నారు. కైలాస ఆటలో పైకి వెళ్లాక పెద్ద పాము మింగినట్లు రాష్ట్ర పరిస్థితి అయిందని, కరోనాలో కూడా రైతుబంధు ఇచ్చి రైతుల కోసం మంచి పథకాలను నేను అమలు చేస్తే అంత గంగలో కలిసిపోయింది అన్నారు.

గురుకుల హాస్టల్ లో తిండి బాగా లేక పిల్లలు అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుబంధుకు రామ్ రామ్.. దళిత బందుకు జై భీమ్.. చెప్పేసారని, తులం బంగారం పతకం గోవిందా.. కాంగ్రెస్ పాలనలో అంతట అసంతృప్తి మిగిలింది అన్నారు.

ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టిగా కొట్టడం నాకు అలవాటు.. నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా.. కొడితే మామూలుగా ఉండదు.. ఫిబ్రవరి చివరి వారంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

MOST READ :

  1. Osmania Hospital : 14 అంతస్తులలో ఉస్మానియా ఆస్పత్రి.. నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!

  2. Miryalaguda : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. మొబైల్ ద్వారా నగదు రహిత రైల్వే టికెట్..!

  3. Kumbh Mela Monalisa : కుంభమేళ మోనాలిసాకు వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం..!

  4. Miryalaguda : కాంగ్రెస్‌వి 420 హామీలు.. బిఆర్‌ఎస్‌ ఆగ్రహం, గాంధీ విగ్రహానికి వినతి..!

మరిన్ని వార్తలు