Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : ఓ వైపు పంటలు ఎండిపోతుంటే.. మరో వైపు సాగర్ నీరు సముద్రము పాలు..!

Nalgonda : ఓ వైపు పంటలు ఎండిపోతుంటే.. మరో వైపు సాగర్ నీరు సముద్రము పాలు..!

  • ఉదయ సముద్రం నీటి లెవల్ను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ జిల్లాలో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ నుండి వందల టీఎంసీల ల నీరు సముద్రం పాలు జేస్తున్నరనీ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.  మంగళవారం ఆయన నల్లగొండ పట్టణ సమీపంలోని ఉదయ సముద్రం నీటి ప్రవాహాన్ని నీటి లెవల్ పరిశీలించిన అనంతరం టిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయనీ కింద చివరి ఆయకట్టు కు సాగునీరు అందడం లేదనీఅయిన జిల్లా మంత్రులకు కనీస సోయి లేదు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి కి నీళ్లు వదలాలనేఆత్రుత జిల్లా లో రైతులకు నీళ్లు ఇద్దాం అని మంత్రులకు లేదు అని విమర్శించారుఇది దురదృష్టకరంచెత్త గాళ్ళు చెత్త మాటలు మాట్లాడుతారనీ తప్ప సాగు నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు వీల్లు అని దుయ్యబట్టారు.

చిత్తశుద్ధి లేదనీమిము వున్నప్పుడు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు ఇఛ్చి చూపినం అనిచెరువులు నిండు కుండల్లాగా వుంచినంప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చినం. ఎమ్మార్పీ లిఫ్ట్ కింద ఉన్న డి 25, డి26,డి29 డి31.39,40 డిస్ట్రిబ్యూటరి ల కింద 70 వెల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత మాదన్నారు.వరుసగా 8 ఏళ్ళు నీళ్లు ఇచ్చినం.

కోమటిరెడ్డి మంత్రి అయిన తర్వాత మళ్ళీ పొలాలు ఎండిపోతున్నాయి… హెలికాఫ్టర్ల సోకు, ఆర్భాటాలు తప్ప రైతుల మీద ప్రేమ లేదు అన్నారు. ఒక వైపు బనకచర్ల తో గోదావరి నీటిని ఆంధ్రకు కట్టబెట్టాలాని చూస్తున్నారునీళ్లు ఇవ్వమని ధర్నా చేస్తున్న రైతులపై కేస్ లు పెట్టించారు.

కోమటిరెడ్డి.. దందాలు చేసుడు, కమిషన్లు కాంట్రాక్టు లు తప్ప వీళ్లకు వేరే సోయి లేదని విమర్శించారు. కనీసం ఉదయ సముద్రం నింపలేదన్నారు.  ఈ ప్రభుత్వంలో కోమటిరెడ్డి, ఉత్తమ్ ఇద్దరు ఇద్దరే, అసమర్థులే నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు, కృష్ణ నది జలకళ సంతరించుకున్నా కూడా జిల్లాలో చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి.

గత సంవత్సరం కూడా ఇదే విధంగా పంటలు ఎండబెట్టారువెంటనే పూర్తిస్థాయిలో నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.నల్లగొండ ఐకాన్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నల్గొండ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి సొంత క్యాంపు ఆఫీస్ గా మార్చడం దురదృష్టకరంగెస్ట్ హౌస్ గానే ఉంచాలని డిమాండ్ చేస్తున్న వీఐపీలు లు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ ను ఉపయోగించుకుంటారు.

అంతే కాని మంత్రి క్యాంపు ఆఫీస్ కోసం వాడుకోవద్దు అన్నారునల్గొండ ఐకాన్ లాగా మేము కట్టినం 6.25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.  క్షుద్రపూజలు అంటూ కోమటిరెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కోమటిరెడ్డి కి మంత్రి వర్గం లో కొనసాగే అర్హత లేదు అన్నారు.

ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులఎం సి కోటిరెడ్డి . నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిరా పంకజ్ యాదవ్, మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి,

నల్గొండ మున్సిపల్ మాజీ ఫోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కనగల్ తిప్పర్తి నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, సింగిల్ బిండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి ధోటి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్, తుమ్మల లింగస్వామి,

మాజీ ఎంపీపీ నారబోయిన బిక్షం సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, కంచనపల్లి రవీందర్రావు, సింగం రామ్మోహన్, రావుల శ్రీనివాస్ రెడ్డి, గాదెరాంరెడ్డి, జమాల్ ఖాద్రి,గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి,పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, మెరుగు గోపి,వనపర్తి జ్యోతి, ప్రసన్న రాజ్, కందుల లక్ష్మయ్య బడుపుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు,

మైనార్టీ విభాగమ అధ్యక్షులు అన్వర్ పాషా, ఊట్కూరు సందీప్ రెడ్డి, ఎర్రమాద వెంకటరెడ్డి, గుండెబోయిన జంగయ్య, జైపాల్ రెడ్డి దొడ్డి రమేష్ తగుళ్ళ శీను లతోపాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!

  2. Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!

  3. Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..! 

  4. District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!

  5. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!

మరిన్ని వార్తలు