Heart Attack : మీరు రోజూ ఇలా చేయకుంటే.. హార్ట్ ఎటాకే..!

Heart Attack : మీరు రోజూ ఇలా చేయకుంటే.. హార్ట్ ఎటాకే..!
మన సాక్షి:
ఉదయం లేవగానే మొదటి పనిగా దంతాలు తోముతాం? అయితే, దంతాలు శుభ్రం చేసుకోవడం కేవలం ఉదయం చేసే అలవాటు మాత్రమే కాదని చాలామంది భావిస్తారు. రోజుకు రెండుసార్లు దంతాలు తోమాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం లేవగానే ఒకసారి, మరోసారి రాత్రి భోజనం తర్వాత పళ్లు తోమాలని సూచిస్తున్నారు.
ఇటీవల హార్వర్డ్ డాక్టర్ సౌరభ్ సేథ్ ఇన్స్టాగ్రామ్లో రోజుకు రెండుసార్లు, ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు దంతాలు తోముకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి షేర్ చేశారు. “రోజుకి రెండు సార్లు పళ్లు తోమడం మానేస్తే దంత క్షయం మాత్రమే కాదు, గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు పళ్లు తోముతున్నారా” అని ఓ వీడియోలో నెటిజన్లను ప్రశ్నించారు.
ఎన్నో సమస్యలు..
చిగుళ్ల వ్యాధి (పీరియాడాంటైటిస్)కి, గుండె జబ్బులు, పక్షవాతం వంటి హృదయ సంబంధ సమస్యలకు బలమైన సంబంధం ఉందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. నోటి ఆరోగ్యం అంటే కేవలం దంతాలు, చిగుళ్ల గురించి మాత్రమే అని చాలామంది అనుకుంటారు కానీ అది అలా కాదు.
జులై 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం, చిగుళ్ల వ్యాధి మొత్తం ఆరోగ్యంపై, ముఖ్యంగా గుండె జబ్బులు, సంబంధిత రోగ నిర్ధారణలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. 2021లో జరిగిన సమీక్ష అధ్యయనం, “చిగుళ్ల వ్యాధి ఉన్నవారిలో గుండె జబ్బులు ఎక్కువగా కనిపిస్తాయి” అని నిర్ధారించింది. “గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా అనేక మరణాలకు కారణమవుతున్నాయి.
వీటిలో గుండెపోటు, అధిక రక్తపోటు, కరోనరీ ధమనులు గట్టిపడటం, ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్, గుండె వైఫల్యం, ఆర్టీరియల్ ఫైబ్రిలేషన్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వంటివి ఉన్నాయి. అంతేకాక, చిగుళ్ల వ్యాధి మానవుల్లో ఆరోస్థానంలో ఉన్న సాధారణ వ్యాధి. ఈ వ్యాధులకు సాధారణ ప్రమాద కారకాలు ఉన్నాయని, వీటి మధ్య సంబంధం ఏర్పడుతోందని తెలుస్తోంది” అని పరిశోధకులు చెబుతున్నారు.
చిగుళ్ల వ్యాధి ఉన్నప్పుడు, నోటిలోని బ్యాక్టీరియా మంటపుట్టిన చిగుళ్ల ద్వారా రక్తంలోకి చేరుతుంది. ఈ బ్యాక్టీరియా రక్తనాళాల్లో మంటను ప్రేరేపిస్తుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ సులభంగా పేరుకుపోయి ప్లేక్లు ఏర్పడతాయి. రక్తనాళాల్లో అడ్డంకులు తలెత్తుతాయి. ఇది గుండె జబ్బు, అధిక రక్తపోటు, పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతుంది.
నోటి పరిశుభ్రత సరిగా లేకపోతే ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ అనే స్థితి రావచ్చు. ఇందులో నోటిలోని బ్యాక్టీరియా గుండె లోపలి పొరకు సోకుతుంది. ఇప్పటికే గుండె సమస్యలున్నవారికి ఇది మరింత ప్రమాదకరం, తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.
గుండె జబ్బు ఉన్నవారికి, దీర్ఘకాల చిగుళ్ల సోకుడు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. నిరంతర మంట వల్ల హృదయ వ్యవస్థ సరిగా పనిచేయడం కష్టమవుతుంది, లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.
రోజుకు రెండుసార్లు దంతాలు తోముకోవడం, ఫ్లాస్ చేయడం, తరచూ దంత పరీక్షలు చేయించుకోవడం వల్ల చిగుళ్ల వ్యాధిని నివారించి, గుండె సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నోటి ఆరోగ్యం గుండె ఆరోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి, చిగుళ్ల నుండి రక్తస్రావం, దుర్వాసనను వస్తుంటే నిర్లక్ష్యం చేయవద్దు.
Reporting : Vishal, Hyderabad
MOST READ :
-
Watermelon : పుచ్చకాయ తీసుకుంటున్నారా.. వీటిని చెక్ చేయకపోతే రుచిలేని పండుతో డబ్బులు బొక్క..!
-
TG News : సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి.. ఏంటి ఈ వ్యాధి.. ఎవరికి వస్తుంది.. అవగాహణ..!
-
Summer Tours : టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ బడ్జెట్, టాప్ 10 సమ్మర్ టూరిస్ట్ ప్లేసేస్..!
-
Hyderabad : హైదరాబాద్లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు..!
-
Civil Supply : సివిల్ సప్లై అధికారుల దాడులు.. పెట్రోల్ బంకు సీజ్..!









