District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..!
మర్రిగూడ, మన సాక్షి:
గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగామొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె మర్రిగూడ మండలం, సరంపేట, శివన్న గూడెం ,వట్టిపల్లి గ్రామాలలో పర్యటించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు.
నామినేషన్ దాఖలు ప్రక్రియ, సిబ్బంది హాజరు, అభ్యర్థులకు కల్పిస్తున్న సేవలు, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి కేంద్రంలో క్రమశిక్షణ, నిబంధనలు కచ్చితంగా పాటించాలని, రిజర్వేషన్లను కల్పించిన వారికి కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన, మహిళా అభ్యర్థుల కోసం ప్రత్యేక సహాయ డెస్క్ ల ఏర్పాటు, అభ్యర్థులు కరెంట్ బ్యాంకు ఖాతా సమర్పించాల్సి ఉంటుందని, అభ్యర్థులు సమర్పించే నగదును ఎలా స్వీకరిస్తున్నారని ? అలాగే వారికి రసీదు ఇస్తున్నారా? అని అడిగారు.
డిజిటల్ గోడ గడియారం అమర్చుకోవాలని చెప్పారు. చెక్ లిస్టులను నామినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన నామినేషన్లను టీ పోల్ యాప్ లో అప్లోడ్ చేయాలని అన్నారు.
తాగునీటి సౌకర్యం, వికలాంగుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి అభ్యర్థిగౌరవంగా ఇబ్బంది లేకుండా నామినేషన్ దాఖలు చేయగల వాతావరణ కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. చండూర్ ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మున్నయ్య, తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Elections : ఎన్నికల పరిశీలకులు కీలక ప్రకటన.. ఫిర్యాదుల నమోదుకు టోల్ ఫ్రీ నెంబర్..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!
-
High court : సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల జీవో 46 పై హైకోర్టులో విచారణ..!
-
Rythu Bharosa : యాసంగి రైతు భరోసా ఆ రైతులకే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Hyderabad : బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు వసూలు..!










