Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

మిర్యాలగూడ డివిజన్ లో వర్షానికి నేలకొరిగిన వరి.. పంట పొలాల్లో ఇసుక మేటలు..! 

మిర్యాలగూడ డివిజన్ లో వర్షానికి నేలకొరిగిన వరి.. పంట పొలాల్లో ఇసుక మేటలు..! 

నల్లగొండ/వేములపల్లి, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ లో గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరి పంటలు దెబ్బతిన్నాయి. వాగుల వెంట ఉన్న వారిచేలు నీట మునిగాయి. వరి పొలాల్లో ఇసుక మేటలు నిలిచాయి. డివిజన్ లోని మిర్యాలగూడ, వేములపల్లి, మాడుగులపల్లి మండలాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి.

దెబ్బతిన్న వరి పంటకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా పైపులైన్లు, మోటర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కాగా అప్పులు తెచ్చి వరి పంట వేశారు. రైతులు నాటు వేసిన నుంచి కలుపు ఇతర మందుల ఖర్చు 40,000 రూపాయలు అవుతుందని రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వం మద్దతు ధర మంచిగా ఇవ్వడంతో మండలంలోని పలు గ్రామాలలో వరి పంట ఎక్కువగా సాగుచేశారు. ఆరుగాలం కష్టపడి వరి పంట సాగు చేసినప్పటికీ ప్రకృతి వైపరీత్యాల వలన అప్పులతో సతమతం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఎకరానికి 25000 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అన్నదాతలకు అండగా ఉండేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేములపల్లి మండలంలోని ఆమనగల్లు, రావులపెంట చెరువు కింద రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి చెరువు మత్తడి దూకడంతో చెరువు కింద ఉన్న వరి పంట పొలాలు నేలమట్టమయ్యాయి.

విద్యుత్ మోటర్లు, పైపులైన్ల సైతం పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 35 ఎకరాల పాటు ఇసుక మేటలు వేశాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

నాలుగు ఎకరాల సాగు నష్టం: సైదులు

నేను దాదాపు చెరువు కింద 4 ఎకరాల వరి పంట సాగు చేశాను. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి నేలమట్టమయింది. వర్షానికి పొలం వర్రెలు పడి ఇసుక మేటలు వేశాయని అన్నారు. నా పొలంలో ఉన్న పైపులు, విద్యుత్ మోటర్లు సైతం పూర్తిగా కొట్టకపోయాయి. ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేసి…. ఎకరాకు 30 వేల రూపాయలు నష్టపరిహారాన్ని కోరుతున్నాను.

రెండు ఎకరాలు పంట నష్టం: ఎలగపల్లి వెంకటయ్య

చెరువు కింద రెండు ఎకరాల వరి పంట సాగు చేశాను. నా పొలం పూర్తిగా ఇసుక మేటలు వేశాయని అన్నారు. వర్షానికి విద్యుత్ మోటర్లు,పైపులైన్లు కొట్టకపోయాయి. ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం అందించాలి.

ప్రభుత్వం ఆదుకోవాలి: ఎలాగపల్లి నరేష్

నేను ఎకరం భూమి వరి పంట వేశాను. వర్షానికివరి పంట పూర్తిగా నేలమట్టమయింది. ప్రభుత్వం ఎకరాకు 30 వేల రూపాయల నష్టపరిహారం అందించాలని కోరుతున్నాను.

LATEST UPDATE : 

Gold : రూ.25 వేలకే తులం బంగారం.. కేంద్రం సరికొత్త ఆలోచన..!

అర్ధరాత్రి హైదరాబాదులో దంచి కొట్టిన వాన.. ఈరోజు కూడా భారీ వర్ష సూచన..!

Miryalaguda : మిర్యాలగూడకు సబ్ కలెక్టర్ హోదా.. విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారి నారాయణన్..!

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

మరిన్ని వార్తలు