Suryapet : సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు, జాగీరు కాదు.. రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి..!
సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు కాదు అని ఎవరి జాగిరు కాదు అని తెలంగాణ రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

Suryapet : సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు, జాగీరు కాదు.. రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు కాదు అని ఎవరి జాగిరు కాదు అని తెలంగాణ రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జె ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ పాలనే నడుస్తుంది అని అన్నారు.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో 117 గ్రామ పంచాయతీలకు 73 కి పైగా సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని అన్నారు. భవిష్యత్తులో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదని సర్పంచ్ కౌన్సిలర్ ఎన్నికలు జరిగితే అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో 48 వార్డులు మొత్తం గెలుచుకొని మున్సిపాలిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సును, ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న బియ్యం, రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు అని అన్నారు.
70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని రెండు వర్గాలు ఉన్నాయి మాకు టికెట్ రాదు అనే సందేహం అసలే వద్దని పార్టీలో పని చేసిన ప్రతి ఒక్కరికి టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగిందని అయినా సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అన్నారు.
ఒక్కరు ఇద్దరి బ్రోకర్ల వల్ల కాంగ్రెస్ పార్టీ బ్రష్టు పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి అబ్బ సొత్తు కాదు అని అందరూ త్యాగాల తోటి కాంగ్రెస్ పార్టీ నిర్మాణం జరిగిందని అన్నారు. గెలిచే నాయకులకే టికెట్ ఇచ్చి రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని గెలుచుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రవిబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తండు శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, డాక్టర్ రామ్మూర్తి, మాజీ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, వెలుగు వెంకన్న, యాట వెంకన్న, ఉపేందర్, దేవేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
MOST READ
-
Miryalaguda : ప్రజాదరణ పొందిన మనసాక్షి.. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..!
-
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ నిధులు దుర్వినియోగం, కార్యదర్శి సస్పెండ్..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. శాసనసభలో సీ ఎం రేవంత్ రెడ్డి స్పష్టం..!









