Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి..!

Miryalaguda : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి:

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండి.. పార్టీ అభ్యర్ధుల గెలుపునకు కృషి చేయాలని
మాజీ ఎమ్మల్యే నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం మిర్యాలగూడ టౌన్ రెడ్డికాలనీ బారాస పార్టీ కార్యాలయములో వేములపల్లి మండల పార్టీ ఆధ్వర్యములో విసృత స్థాయి సమావేశము నిర్వహించారు. సమావేశానికి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి హాజరై వేములపల్లి మండల, గ్రామ కమిటి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్బంగా భాస్కర్ రావు మాట్లాడుతూ పార్టీ తరపున ఎవరిని అభ్యర్ధిగా నియమించినా అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల నుంచి గ్రామా, మండల స్థాయిలో ఎటువంటి గ్రూపు, వర్గాలు లేకుండా పనిచేసి అత్యదిక సంఖ్యలో మన పార్టీ అభ్యర్ధులు విజేతలు అవ్వడానికి కష్టపడాలని, ఎలాగు అధికార కాంగ్రెస్ పార్టీ పై ప్రజలు తిరగబడతున్నారని, గ్రామాలలో కనపడితే నిలదీసే పరిస్థితి ఉందన్నారు.

ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ కోటి ఆర్ కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసిన విషయం తెలిసిందే అన్నారు. బాకీ కార్డును గ్రామములో అందరికి అందించాలని కోరారు.

ఈ కార్యక్రమములో నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, చిర్ర మల్లయ్య యాదవ్, కట్టా మల్లేష్ గౌడ్, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, పేరాల కృపాకర్ రావు, నంద్యాల శ్రీరాం రెడ్డి, అమిరేడ్డి శేఖర్ రెడ్డి, మేక రవి, పేరాల గుర్వ రావు, దేవారాజ్, రేగురి రాము, గురువయ్య తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

  2. Bandi Sanjay : ఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం..!

  3. Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!

  4. Groups : తల్లి అంగన్వాడి ఆయా.. కుమారుడికి ఒకేసారి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్, నయాబ్ తహసిల్దార్, ఉద్యోగాలు..!

మరిన్ని వార్తలు