Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసంగారెడ్డి జిల్లా

Rythu : వర్షాల నేపథ్యంలో.. పత్తి రైతులకు అధికారులు సూచనలు..!

Rythu : వర్షాల నేపథ్యంలో.. పత్తి రైతులకు అధికారులు సూచనలు..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం జమ్గి (బి) గ్రామాన్ని ఖేడ్‌ డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు నూతన్‌ కుమార్‌, ఏడిఏ భార్గవ్‌ బుధవారం సందర్శించారు. ఈ మేరకు పత్తి పంట, యాసంగికి సిద్ధమవుతున్న రైతులతో మాట్లాడారు.

ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు పత్తి పంటలో పోషక లోపాలు గుర్తించామన్నారు. ప్రధానంగా మెగ్నీషియం, బోరాన్‌, జింక్‌, పొటాషియం లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్థానిక ఏఈవో సూచనల మేరకు పంటలోపాల నివారణకు పిచికారి చేయాలని తెలిపారు.

ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి :

రబి సీజన్‌లో రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా సిద్ధంగా ఉంచాలని ఖేడ్‌ ఏడిఏ నూతన్‌ కుమార్‌ అన్నారు. కంగ్టి మండలం తడ్కల్‌ గ్రామంలో ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ మేరకు స్టాక్‌ వివరాలు, సంబంధిత రికార్డులను పరిశీలించారు.

విత్తనాలు, పెస్టిసైడ్స్‌ మందుల ఎక్సైరీ డేట్‌ ను తనిఖీ చేశారు. స్టాకు వివరాల రికార్డుల నమోదు సక్రమంగా కొనసాగించాలని ఫర్టిలైజర్స్‌ డీలర్లను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటేశం, ఫర్టిలైజర్ డీలర్లు తదితరులు ఉన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు