TOP STORIESBreaking Newsసంక్షేమం

TG News : పెన్షన్ల పెంపు అప్పుడే.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!

TG News : పెన్షన్ల పెంపు అప్పుడే.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త అందజేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్లను పెంచుతామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది… అయినా ఇంకా ఇప్పటివరకు నెలనెల అందజేసే పింఛన్లు పెంచలేదు. కాగా ఇటీవల మంత్రి సీతక్క కీలకమైన ప్రకటన చేసింది. త్వరలో పింఛన్ దారులకు పెన్షన్ పెంచనున్నట్లు తెలియజేసింది.

Gold Price : ముగిసిన కార్తీక మాసం.. మళ్లీ పసిడి కి రెక్కలు..!

వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రస్తుతం నెలకు 2 వేల రూపాయలను ఆసరా పెన్షన్ కింద అందజేస్తుంది. వికలాంగులకు 4000 రూపాయలను అందజేస్తుంది. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు నెలకు 4 వేల రూపాయలను అందజేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా వికలాంగులకు నెలకు 6000 రూపాయలను ఇస్తామని పేర్కొన్నారు.

TG News : తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఇంటర్ అర్హతతోనే వీఆర్వో ఉద్యోగాలు..!

కాగా ఆసరా పెన్షన్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. ఆసరా పెన్షన్లను పెంచే విషయంపై డిసెంబర్ నెలలో నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. జనవరి మాసంలో పెన్షన్లు పెంచుతూ జీవో జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరందరికీ ఫిబ్రవరి మాసం నుంచి పెంచిన పెన్షన్లు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది. పెంచిన పెన్షన్లు అందజేసిన తర్వాతనే గ్రామపంచాయతీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలు