Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కూలీల కోసం కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. వారికి ప్రతి సంవత్సరం 12000 రూపాయలను అందించేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింద జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకంలో అర్హత సాధించేందుకుగాను భూమిలేని వారై ఉండడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉండి 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజుల పని దినాలు పూర్తి చేసి ఉండాలి. ఈ నిబంధన మేరకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 18,180 మందికి ఒక్కొక్కరికి ఆరువేల రూపాయల చొప్పున 10.90 కోట్ల రూపాయలకు పైగా వారి వారి ఖాతాలలో జమ చేశారు.
ఇదిలా ఉండగా జనవరి ఒకటి నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన గ్రామసభలలో అనేక మంది తమకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల జాబితాలో పేరు లేదంటూ దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,24 487 కొత్తగా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కేవలం 19,193 దరఖాస్తులకు మాత్రమే అర్హత ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 1,44,794 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. మరో 49,542 దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 5,80,577 మందిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. కొత్త దరఖాస్తులలో మరో 20 నుంచి 30 వేల మంది అర్హత సాధించే అవకాశం ఉంది. దాంతో సుమారుగా రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని పొందనున్నారు.
ఆటోమేటిక్ గా రిజెక్ట్ :
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి వచ్చిన దరఖాస్తులలో కొన్ని దరఖాస్తులు ఆటోమేటిక్ గా రిజెక్ట్ అవుతున్నాయి. వారితో పాటు వారి కుటుంబంలో ఎవరికైనా వ్యవసాయ భూమి కనీసం సెంటు ఉన్నా కూడా ఈ పథకం దరఖాస్తును రిజెక్ట్ అవుతుంది. దరఖాస్తులు ప్రత్యేక పోర్టల్లో ఎంట్రీ చేస్తున్నారు. లబ్ధిదారుల పేరు, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయడంతో వెంటనే వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికీ భూమి ఉన్నా.. వారికి దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది.
అంతే కాకుండా గతంలో వారి పేరుమీద భూమి ఉన్న విక్రయించుకున్నా కూడా పేర్లు మారకపోవడంతో అప్లికేషన్లు రిజెక్టు అవుతున్నాయి. కొన్నింటిపై తహసిల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇదిలా ఉండగా మరో వారం రోజుల్లో కొత్త దరఖాస్తులతో పాటు పాత దరఖాస్తులలో ఉన్న అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు.
వీరందరికీ ఏటా 12 వేల రూపాయలను ప్రభుత్వం వారి వారి ఖాతాలలో జమ చేయనున్నది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు ఖాతాలలో డబ్బులు జమ కావడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనంతరం వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు కానున్నది.
MOST READ :
-
District collector : ప్రజావాణిలో 80 దరఖాస్తులు.. త్వరగా పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..!
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధర..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్
-
Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!
-
Penpahad : కల్తీ విత్తనాలతో భారీగా నష్టం.. వ్యవసాయ అధికారులకు రైతు ఫిర్యాదు..!









