Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : 123 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్.. స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే..!

Suryapet : 123 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్.. స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే..!

అర్వపల్లి, మనసాక్షి

సూర్యాపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇండస్ట్రియల్ పార్కు కొరకు తుంగతుర్తి మండలం వెలుగు పల్లి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని శాసనసభ్యులు సామేలతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

శుక్రవారం సాయంత్రం తుంగతుర్తి మండలం వెలుగు పల్లి రెవెన్యూ పరిధిలోని 365 జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 564 సర్వేనెంబర్ 563 లో గల 123.32 గుంటల ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమె నా ఆశయమని ఎమ్మెల్యే తెలిపారు.

త్వరలో ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కును ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేస్తామని అన్నారు . ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు తీసుకువస్తే యువతకు ఉపయోగకరంగా ఉంటుందో ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. అలాగే పక్కనే ఉన్న రుద్రమ్మ రిజర్వాయర్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ టీ దయానందం ,ఎంపీడీవో శెషు కుమార్ , సర్వే ఎయిర్ సాయి కృష్ణ, ఏ ఆర్ ఐ రవీందర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు