అమరావతి : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్

అమరావతి : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్

అమరావతి, మన సాక్షి :

అమరావతి లోని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరును సిఐడి చేర్చింది. ఈ మేరకు ఆ కేసులో లోకేష్ పేరును చేరుస్తూ మంగళవారం సిఐడి కోర్టులో మేము దాఖలు చేసింది. ఈ కేసు విషయంలో లోకేష్ పేరును చేర్చేందుకు ఉన్న ఆధారాలు ఏంటి..? ఏ కోణంలో చేర్చారు..? తదితర విషయాలను సిఐడి వెల్లడించాల్సి ఉంది.

ALSO READ : Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!

సిఐడి మెమోపై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో ఇదే కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ పేర్లను సిఐడి చేర్చింది. నారాయణ ముందస్తు బెయిల్ పొందారు. ఈ కేసులోనే చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజే హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ : Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!