SARPANCH : జాక్ పాట్ సర్పంచ్ మల్లమ్మ..!

SARPANCH : జాక్ పాట్ సర్పంచ్ మల్లమ్మ..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
సర్పంచ్ ఎన్నికల్లో మల్లమ్మను ఆ పదవి వరించింది. ఆమె జాక్ పాట్ లో ఏకగ్రీవ సర్పంచిగా ఎన్నిక కానున్నది.. వివరాలు ఏంటంటే..
వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ మహిళకు ఆస్థానం రిజర్వ్ అయింది. కాగా ఆ ఊరిలో 1600 ఓట్లు ఉన్నాయి. సర్పంచ్ స్థానం ఎస్సి మహిళకు రిజర్వు అయింది.
కాగా ఆ ఊరిలో ఎస్సీ మహిళా ఓటరు కొంగర మల్లమ్మ ఒక్కరే ఉంది. ఆమెనే సర్పంచిగా కన్ఫామ్ కావడంతో జాక్ పాట్ సర్పంచ్ గా నిలిచింది.
అయితే అన్ని పార్టీల నేతలు కూడా మల్లమ్మ వైపే చూస్తున్నాయి. తమ పార్టీలో అంటే తమ పార్టీలో చేరాలంటే ఒత్తిడి తెస్తున్నారు. ఆ గ్రామంలో ఒకే ఒక్క ఎస్సీ మహిళా ఓటరు మల్లమ్మ ఉన్నదని, సర్పంచ్ స్థానం కూడా ఎస్సీ మహిళకు రిజర్వ్ అయినట్లు ఎంపీడీవో రవీందర్ వెల్లడించారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్ గా చేస్తానని గ్రామస్తులందరూ తనకు సహకరిస్తే తాను కూడా గ్రామాభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు.
జాక్పాట్లో మల్లమ్మకు సర్పంచ్ పదవి
వరంగల్‌లోని సంగెం మండలంలో ఓ ఎస్సీ మహిళకి రిజర్వ్ అయిన ఆశాలపల్లి గ్రామ పంచాయతీ స్థానం
ఆ ఊరిలో కేవలం ఒక్క ఎస్సీ మహిళా ఓటరు కొంగర మల్లమ్మ ఉండటం వల్ల.. ఆమెనే సర్పంచ్‌గా కన్ఫర్మ్
పంచాయతీలో 1,600 పైగా ఓటర్లున్నా, కానీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్… pic.twitter.com/C6WPVx08f6
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 28, 2025
MOST READ :
-
Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!
-
Miryalaguda : నగదు బహుమతులు గెలుచుకున్న సెయింట్ జాన్స్ విద్యార్థులు..!
-
Hyderabad : బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు వసూలు..!









