Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

జగదీష్ రెడ్డి ఆస్తుల పై ఈ డి విచారణ జరిపించాలి

జగదీష్ రెడ్డి ఆస్తుల పై ఈ డి విచారణ జరిపించాలి

కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి

మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యపేట శాసనసభ్యులుగా గెలిచిన నాటి నుండి సూర్యాపేట జిల్లా, నియోజకవర్గంలో తన అనుచరులతో ఇసుక , ల్యాండ్ మాఫియాలకు భూకబ్జాలు పాల్పడుతూ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని వాటిపై న ఈ డి విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

సూర్యాపేట పట్టణములోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ చెందిన బి సి నాయకుడు మాకు కూడా ఎమ్మెల్యే టికెట్ కావాలి అని ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలోనే ఆ నాయకుడిని పూర్తిగా దొంగా అని చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. జానయ్య భూదంద్దల్లో మంత్రి కి వాటా ఉందని అందుకే 9 సంవత్సరాలు అతన్ని కాపాడి ఇప్పుడు టికెట్ అడిగే సరికి కేసులు తిరుగతోడిస్తూ డ్రామాలు చేస్తున్నాడని అన్నారు.

 

MOST READ : 

  1. Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!
  2. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
  3. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
  4. SONIYA : సోనియాతో ముగిసిన షర్మిల భేటీ.. తెలంగాణకా.. ఏపీకా..?

 

ఇన్నాళ్లు పార్టీలోఉంచుకొని డి సి ఎం ఎస్ చైర్మన్ గా ఒక పెద్ద హోదా కల్పించి చివరి దశలో తనను దొంగా మరియు భూకబ్జా ధారునిగా చిత్రీకరించడంలో రహస్యం ఎంటిదో చెప్పాలి అని అన్నారు.సూర్యాపేట కలెక్టరేట్ వద్ద దళితుల భూములను అతి తక్కువ ధరలకు విక్రయించి దళితుల పొట్ట కొట్టారని అన్నారు.
కె సి ఆర్ నాయకత్వంలో ఆనాడు డొక్కు స్కూటర్ మీద తిరిగిన నువ్వు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎక్కడివి అని ,పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడిన మంత్రి జగదీశ్ రెడ్డి ని మంత్రి వర్గం నుంచి సస్పెండ్ చేయాలనీ ముఖ్యమంత్రి ని డిమాండు చేశారు.

 

మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై ఈడీ విచారణ చేపట్టాలి అన్నారు గత 9 సంవత్సరాలుగా చాలా మందికి పదవుల ఆశ చూపి విచ్చలవిడిగా డబ్బులు దోచుకోవడం జరిగింది అన్నారు.  మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరియు వట్టె జానయ్య యాదవు విరి ఇద్దరి పై విచారణ చేపట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండు చేశారు.

మరిన్ని వార్తలు