Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జైలుకే..!

Narayanpet : డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జైలుకే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానా తో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బాలరాజు మాట్లాడుతూ వాహనదారులు మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. మద్యపానం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదానికి గురై అవకాశం ఉంటుందని, జాగ్రత్తగా వచ్చే వారి వాహనాలకు కూడా రోడ్డు ప్రమాదాలు జరిగా అవకాశం ఉంటుంది.

కావున వాహనదారులు మద్యపానం సేవించి వాహనాలు నడప రాదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికితే జరిమానా తో పాటు జైలుకు పంపించడం జరుగుతుంది అని తెలిపారు. హనదారులు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదని, వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించలన్నారు.

టూ వీలర్స్ పై ఇద్దరకు మించి ప్రయాణించరాదని, ఆటోలో సీట్ పర్మిట్ ఉన్నంతవరకే ప్యాసింజర్ ఎక్కించుకోవాలని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీస్ వారికి సహకరించాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు గోవింద్, వాహనదారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు